378 తెలుగు భాషా చరిత్ర
(a) స్వార్థం చేయు-చేసుకొను; అమ్ము-అమ్ముకొను; చదువు=చదువుకొను. (b) పారస్పర్యార్థం. మాట్లాడు = మాట్లాడుకొను; కొట్టు - కొట్టుకొను; తిట్టు = తిట్టుకొను.
వాక్యంలో కర్తృ నామబంధం బహువచనం అయినప్పుడే పారస్పర్యార్థం వస్తుంది. ఏకవచననామకర్తృకమైనప్పుడు స్వార్ధమే వస్తుంది. ఉదా ; (1) అతను. నన్నుతిట్టుకొంటున్నాడు. (2) వాళ్ళెప్పుడూ తిట్టుకుంటారు.
(c) సకర్మకీకరణం: తెలియు-తెలుసుకొను.
(d) కొన్ని ధాతువులు 'కొను' తో మాత్రమే ప్రయోగయోగ్యాలు. ఉదా: అనుకొను, ఇరుక్కొను, ఊరుకొను, ఒప్పుకొను, కనుక్కొను, గింజుకొను, తేరుకొను, పుచ్చుకొను, పుంజుకొను, మొత్తుకొను.
5. ఈ కింది శబ్దపల్లవాలు ఆ అర్దాల్లో అట్లాగే ప్రయుక్తమవుతాయి. ఉండు, పండు అనేవి అనుబంధక్రియలు. ఉదా : కూరుచుండు, నిలుచుండు, అగపడు, కనబడు, తిరగబడు, నిలబడు,
6. నామాదులనుకూడా ప్రత్యయాదులవల్ల క్రియలుగా ప్రయోగించవచ్చు.
(a) భయం ; భయపడు, భయపెట్టు (c) పాత ; పాతబడు: కష్టం : కష్టపడు, కష్టపెట్టు ఎర్ర ; ఎర్రబడు. పుల్ల : పుల్లబడు
(b) లో : లోబడు. (d) సంతోషం : సంతోషించు. వెనక : వెనకబడు క్షమ : క్షమించు. వీలు : వీలుపడు
13. 11. క్రియాపదాలు : తెలుగు క్రియాపదాలు సమాపక, అసమాపక భేదాలతో రెండు విధాలు. అసమాపక క్రియారూపాలు ఉపవాక్యాంతంలో కాని, ప్రధానవాక్యంలో ఒక పదబంధం స్థానంలో కాని వస్తాయి. అసమాపకక్రియకు కాలబోధకత ఉండవచ్చు. క్రియావిభక్తులుండవు. సమాపకక్రియలకు ఏవో కొన్నిటిని మినహాయిస్తే క్రియావిభక్తులుంటాయి.