ఆధునికభాష : సంగ్రహవర్జనం 377
(e) అంటు అంటించు ఎక్కు ఎక్కించు (f) బిగియు బిగించు ముగియు ముగించు (g) కాలు కాలుచు మారు మారుచు (h) మొలుచు మొలిపించు కురియు కురిపించు
2 సకర్మకం ప్రేరణం సకర్మకం ప్రేరణం
(a) తిట్టు తిట్టించు అడుగు అడిగించు (b) అను అనిపించు తిను తినిపించు (c) కాలుచు కాలిపించు మారుచు మారిపించు
3. ప్రాచీన భాషలో ఉన్నచేయు, వేయువంటి ధాతువులేకాక ఈనాటి భాషలో కొట్టు, తీయు, పెట్టు వంటి ధాతువులు అకర్మకధాతువులను సకర్మక ధాతువులుగా మార్చటానికి ఉపయుక్తమవుతున్నాయి. ఈ ధాతువులను అనుబంధించినప్పుడు ప్రధాన క్రియలు అన్నంతరూపంలో ఉంటాయి. అనుబద్ధ ధాత్వాది పరుషం సరళంగా మారుతుంది.
(a) పగులు పగలగొట్టు పడు పడగొట్టు (b) తెలియ తెలియజేయు (c) అరుగు అరగదీయు విరుగు విరగదీయు (d) కాగు కాగబెట్టు ఆరు ఆరబెట్టు నాను నానబెట్టు కరుగు కరగబెట్టు (e) ఆరు ఆరవేయు నాను నానవేయు
సకర్మక ప్రత్యయస్థానంలో వాడిన ధాతురూపాలు కేవల ప్రత్యయ మాత్రాలుగా కాక క్రియకు కొంత అర్థాన్నికూడా చేరుస్తున్నట్టు కనిపిస్తున్నది. వ్యాపారరీతి (manner) బోధకంగా ప్రవర్తించటం విశేషం. ఉదా : పగలదీయు- -పగలగొట్టు; విరగదీయు-విరగ్గొట్టు; చిరగదీయు-తిరగ్గొట్టు; అరగదీయు-అరగ్గొట్టు -వంటి మాటల జంటలను పరిశీలిస్తే ఈ అర్థభేదాన్ని గమనించవచ్చు.
4. 'కొను' అనే ధాతువు భిన్నర్ధాలో ధాతువు కనుబంధించబడుతుంది. ప్రధానక్రియ ధాతురూపంలోనే ఉంటుంది. యోపథధాతువుల్లో 'య' కారం 'స' కారంగా మారుతుంది.