Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

376 తెలుగు భాషా చరిత్ర

(d) అభివ్యాపకార్థంలో, ఉదా. ఇండియాలో వరి పండుతుంది. సముద్రంలో చేపలుంటాయి.

(e) వైషయికార్థంలో, ఉదా. అతనికి తెలుగులో ప్రవేశం ఉంది. ఈతలో అతనికి నేర్పుంది.

(f) నిర్ధారణార్థంలో, ఉదా. వాళ్ళ నలుగురిలో, ఇతను మంచివాడు.

5. నుంచి ఈ కింది అర్జాలో ప్రయుక్తమవుతుంది.

(a) గమనార్థక ధాతువులతో దేశకాలాల్లో వ్యాపారాది, ఉదా. అతను వాళ్ళ ఊరినుంచి వస్తున్నాడు. ఆ పిల్లవాడు 8 గంటలనుంచి చదువుతున్నాడు.

(b) పర్యంతార్థంలో, ఉదా. అతను 10 ఏళ్ళనుంచి మెడిసిన్‌ చదువుతున్నాడు.

(c) హేత్వర్థంలో, ఉదా. నీనుంచి నాకీ కష్టాలు వచ్చినాయి.

(d) మూలస్థలార్థంలో, ఉదా. చెట్టునుంచి పువ్వులుకోశాడు.

ఈ పైవికాక దగ్గర, వరకు, కోసం, మీద, పైన, కింద, పక్క, గురించి, వల్ల, బట్టి మొదలైన శబ్దాలు భిన్న విభక్తార్ధాల్లో వస్తాయి.

క్రియలు

13.10. తెలుగులో అకర్మక, సకర్మక, ప్రేరణార్థక ధాతువులు విడిగా ఉండట మేగాక ప్రత్యయాదులచేత ఓక వర్గాన్ని ఇంకోవర్గంగా మార్చవచ్చు. ఈ కిందివి దిజ్మాత్రసూచకాలు :

1 అకర్మకం సకర్మకం అకర్మకం సకర్మకం

(a) వంగు వంచు దిగు దించు

   పెరుగు     పెంచు

(b) జరుగు జరుపు

    ఆగు        ఆపు
   తిరుగు       తిప్పు

(c) చూచు చూపు

   గడచు       గడపు

(d) కలియు కలుపు తడియు తడుపు

   మాయు      మాపు