పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

366 తెలుగు భాషా చరిత్ర

దణ్ణెవంటి కొన్ని మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది. కళ్లం, కళ్లె. కళ్లెం, గొళ్లెం, పళ్లెం వంటి నామాలు కుళ్ళు, తుళ్ళు, మళ్ళు, వెళ్ళు వంటి క్రియలూ లేకపోతే 'ళ' వర్ణద్విత్వంకూడాలేనట్లే. ఇవి ఆధునిక కాలంలో ఏర్పడ్డ రూపాలు కావచ్చు.

16. ద్విరుక్తవర్ణాలు మొదటి హ్రస్వాచ్చు తరవాతనే ఉంటాయి.

ఈ పై నియమావళి ఏకశబ్దపరిమితికి మాత్రమేవర్తిస్తాయి. ప్రకృతి ప్రత్యయ సమ్మేళనంలోగాని, భిన్న శబ్దయోగంలోగాని చాలారకాల వర్ణసంయోజనాలుసాధ్యంకావచ్చు. ఉదా : వస్తాడు, చెప్తాడు, వెళ్తు౦ది, కొడ్తు౦ది, చేద్దాం, తిట్టుద్ది.

13. 6. సంధి : త్వరితోచ్చారణలో అవ్యవహితంగావచ్చిన శబ్దాల్లో జరిగే ధ్వనుల మార్పిడి సంధి. వ్యవహితోచ్చారణలో పదాలమధ్య సంధి ప్రవర్తించదు. స్వరలోపమూ, దానిఫలితంగా దగ్గరగావచ్చిన వ్యంజనాల్లో సమీకరణాదిమార్పులు తెలుగుసంధిలో జరుగుతాయి.

1. దగ్గరగావచ్చిన రెండచ్చుల్లో పూర్వ హ్రస్వాచ్చు లోపిస్తుంది. ఉదా : ఆయన + ఎవరు > ఆయనెవరు ; వారు + ఉన్నారు > వారున్నారు.

2. లోపించిన హ్రస్వాచ్చు తాలవ్యమైతే పరంలోఉన్న నిస్తాలవ్యాచ్చుకు తాలవ్యత వస్తుంది. ఉదా : బండి + అంతా, కోడి + అదిగో, చెప్పి + ఉంటాడు, అది + ఒకటే.

3. స్వరాది ప్రత్యయం పరమైనప్పుడు సంధికీ వికల్పతలేదు. ఉదా : మూర + ఎడు > మూరెడు, వచ్చింది + ఆ > వచ్చిందా, పాట + ఏ > పాటే.

4. దీర్ఘ స్వరాంతరూపాలకు తాలవ్యాచ్చులు పరమైతే 'య' ఆగమం, ఒష్ట్యాచ్చులు పరమైతే 'వ' ఆగమం వస్తాయి. ఉదా: మా + ఇల్లు > మాయిల్లు, మా + ఊరు > మావూరు. అకారం పరమైనపుడుకూడా 'య' ఆగమం కొందరి భాషలో కనిపిస్తుంది. ఉదా : మా + అమ్మ > మాయమ్మ, మా + అన్న > మాయన్న. అకార పరమైనపుడు వచ్చే 'య' కారాగమం మా, మీ, నా, నీ శబ్దాల తరవాతనే వస్తున్నట్లు కనిపిసున్నది.

5. (a) రెండు సమవ్యంజనాలమధ్య,

(b) పూర్వవ్యంజన్యం 'ల,న' అలో ఒకటయిన పరవ్యంజనం దంత్య, దంతమూలీయ, తాలవ్య, మూర్ధన్యవర్ణాల్లో ఒకటయినప్పుడు;