పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికభాష : సంగ్రహవర్ణనం 365

11. శబ్దా౦తంలో మ, య వర్ణేతర వ్యంజనాలు రావు. 'య' వర్ణమైనా చాలా కొద్ది మాటల్లోనేఊంది. ఉదా : సంఖ్యా వాచకాలు : ఇరవై , ముప్పై, నలబై, యాభై, అరవై, డెబ్బై, ఎనభై, తొంభై. ఇక్కడ ఐ = అయ్‌.

12. మవర్ణోపధ శబ్దాల్లో పూర్వాచ్చులు ఇ, ఉ ఉంటే పరాచ్చులు కూడా అవే ఉంటాయి. 'అ' ఉంటే, ఉ-అ లు, 'ఎ' ఉంటే 'ఉ' మాత్రమే ఉంటాము. ఉదా : నడిమి, కుడుము, మడమ, ఎడము, పెదెము, పళ్ళెము, కొక్కెము. పదాంతంలో ఉన్న 'ఉ' వర్ణాన్ని గుర్తించకపోతే ఈ నియమాన్ని ఇంతకన్న భిన్నంగా చెప్పాల్సి ఉంటుంది.

13. మూడచ్చుల మాటల్లో చివరిఅచ్చు నిరోష్ట్యమైతే మధ్యాచ్చు నిర్యోష్ట్యం, చివరి అచ్చు తాలవ్యేతర మైతే మధ్యాచ్చు తాలవ్యేతరమూ అవుతుంది. 'అ' వర్ణం తాలవ్యేతరమూ, నిరోష్ట్యమూ. ఈ నియమం పై నియమం (12) వర్తించగా మిగిలిన శబ్దాలకే వర్తిస్తుంది. మిగతా శబ్దాల్లో నడిమి అచ్చు అ, ఇ, ఉ లలో ఒకటి అయి ఉంటుంది. అంటే ఎ, ఒ లు ఉండవు. చివరి అచ్చు అ, ఇ, ఉ లలో ఒకటి మాత్రమే కాక ఎ వర్ణం కూడా ఉంటుంది. 'ఒ' వర్ణం మాత్రం ఉండదు.

అచ్చు1 | అచ్చు2 | అచ్చు3

ఇ, అ ఇ,ఎ,అ

ఉ, అ ఉ, ఆ

ఉదా : పొడుగు, కుడితి, ములికి, గాడిద, ఎలికె.

14. ధాతువుల్లో దీర్ఘాచ్చు మొదటి అక్షరంలోనే ఉంటుంది. చివరి అచ్చు 'ఉ' వర్ణేతరముండదు. మధ్యాచ్చులు ఇ, అ, ఉ లు మాత్రమే ఉంటాయి. యోపధ ధాతువులు మాత్రమే ఇన్మధ్యం కాగలవు. ఉదా : తెలియ (తెలియదు), కదలు (కదలిక), అడుగు. అన్మధ్య ధాతువులనైనా కదలిక (<కదలు), బడలిక (<బడలు) వంటి నామ నిష్పాదన ప్రక్రియ కోసం గుర్తించాల్సి వచ్చింది. అధునిక భాషలో 'తెలియు' తప్ప ఇన్మధ్య ధాతువుగా గుర్తించాల్చినవి లేవు.

15. ఏక శబ్దంలో స, ణ వర్ణాలకు ద్విత్వంలేదు. కస్సు, బుస్సు అనే ధ్వన్యనుకరణాలకు శబ్దపరిగ్రహణం జరగలేదు. తెలంగాణలో కొన్నిచోట్ల 'లెస్స' అనే మాట వాడుకలో ఉంది. ణ వర్ణానికి ద్విత్వం అరుదుగా గొణ్ణె౦, దణ్ణం,