Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

364 తెలుగు భాషా చరిత్ర

4. పదాదిన ద్విరుక్త, సంయుక్త, వ్యంజణలుండవు. ప్రాచీనభాషలో వర్ణవ్యత్యయంవల్ల ఏర్పడ్డ క్ర౦త, గ్రద్ద, త్రిప్పు, ప్రాత, బ్రతుకు వంటి మాటల్లో రెండోవ్యంజనమైన రేఫం ఆధునిక భాషలో జారిపోయింది. కొంతమంది వ్యవహారంలో అరుదుగా ఉంది. వ్రాత, వ్రాలు అనే మాటలు క్రమంగా రాత, వాలు అని మారాయి.

5. థాతువుల్లో మొదటి అక్షరంలో మాత్రమే దీర్ఘాచ్చు ఉంటుంది.

6. నామాల్లో జంతు పక్షి, వృక్ష, నగర, వాచక, శబ్దాలో మాత్రమే ఏ, ఓలు మధ్యాచ్చుగా కనిపిస్తున్నాయి. అబ్బాయి, అమ్మాయి అనే మాటల్లోనూ, తల్లాడవంటి గ్రామనామాల్లోనూ 'ఆ' మధ్య స్వరంగా కనిపిస్తున్నది. తాబేలు, కుందేలు, పోటేలు, పూరేడు, గన్నేరు, పల్లేరు, తంగేడు, నేరేడు, మారేడు, చెంబేడు. ఒంగోలు-వీటిలో ఓలు ప్రోలుకు రూపాంతరంగా భావించవచ్చు. కాని ఏలును జంతువాచకశబ్దంగా ఇప్పటి భాషలో నీరూపించటం కష్టం. అట్లాగే వీడు, వీరు వృక్షవాచకశబ్దాలుగా నిరూపించటం ప్రయాసతో కూడుకొన్న పని. ఒకప్పుడు ఇవన్నీ భిన్నశబ్దాలు కావచ్చు. నేటి వ్యవహర్తలకు ఇట్లా౦టి పరిజ్ఞానం ఉందని తేల్చటం కష్టం.

7. 'ఒ' వర్ణం మొదటి అక్షరంలో మాత్రమే ఉంటుంది. అంతంలో దీర్ఘాచ్చురాదు. ఇట్లా, అట్లా అనే శబ్దాలు ఇందు కపవాదాలు.

8. దీర్ఘాచ్చు తరవాత ద్విరుక్త వ్యంజనం ఉండదు. కొన్ని బంధువాచక శబ్దాలో మాత్రమే ఉంది. ఉదా : అమ్మ, నాన్న, బామ్మ, మామ.

9. స్పర్శాలముందు, స్పృష్టోష్మాలముందు అనునాసికవర్ణ౦ ఆ వర్గజమై ఉంటుంది. కాని ఒకటి రెండు మాటలు మాత్రం ఇందుకపవాదాలుగా నిల్చినాయి. ఉదా : కాన్పు, పాన్పు వీటికి కానుపు, పానుపు అని రూపాంతరాలున్నాయి.

10. ఈ కింది వ్యంజన సంయోగాలు నేటి తెలుగులో కనిపిస్తున్నాయి.

త్ర = పొత్రం. దీనిరూపాంతరం పొత్తరం, ౦డ్ర = తండ్రి, కొండ్ర. వీటిని 'ణ్ర' అనే సంయోగంగా గ్రహిస్తే మూడు వ్యంజనాల సంయోజనం తెలుగులో లేదనవచ్చు. ణ-ర మధ్యవచ్చే 'డ' ధ్వని సూత్రం ద్వారా సాధ్యం అంటే 'డ' వర్ణానికిక్కడ స్వత౦త్రప్రతిపత్తి లేదని, ణ-రల స౦యోగ ఫలితమేనని దీనిభావం. తెలంగాణంలో చెల్క, అర్క, ఎన్క, గట్క వంటి మాటల్లో చాలా వ్యంజన సంయోజనాలు సాధ్యమైనా వాటిని మధ్య-స్వరలోప సూత్రం ద్వారా సాధించవచ్చు.