ఈ పుటను అచ్చుదిద్దలేదు
తెలుగు భాషా చరిత్ర
12.29. ముగింపు : మనలిపి అతిప్రాచీనమైనదనడంలో సందేహం లేదు. ఇదీ చిత్రలిపినుంచే పరిణమించిది. దీనికి మొదట బ్రహ్మీలిపీ అనేపేరు వచ్చింది. ఇది ఉత్తరదక్షిణ బ్రాహ్మీలనీ రెండుశాఖలై౦ది. దక్షిణబ్రాహ్మీలిపే తెలుగు దేశాన్ని పాలించిన అయా రాజుల పేరుతో ప్రచలితమై నేటి తెలుగులిపిగా పరిణమించింది.
జ్ఞాపికలు
1. "వాచకత్వము లేఖనోచితత్వము నాంధ్రలిపిరీతిగా సర్వలిపులయందు” - కేయూర బహుచరిత్ర, అవతారిక, 46.
2. “దంత్య చ, జ, గురు ర, లలకుఁదనరుబొట్లు ” -అప్పకవీయము.