ఈ పుట అచ్చుదిద్దబడ్డది
- తె. క్రింద, క్రీ : త. మ. క. కీఱ్ (1348).
- తె. క్రొవ్వు : త. మ. కోఱు, క. కొర్వు (1784).
- తె. క్రోఁతి : త. కురంకు, మ. కురఙ్ఙు (1373).
- తె. గ్రుడ్డి : త. మ. కురుటు, క. కురుడు (1487).
- తె. గ్రుద్దు : త. కుఱు, కుఱ్ఱు 'దంపు, కొట్టు' (1536).
- తె. గ్రొచ్చు. క్రొచ్చు (శాస : క్ఱొచ్చె): త. కుఱి ('తవ్వు') (1511).
- తె. డాఁగు, దాఁగు : త. అటంకు, క. అడంగు, కూ. డా (58).
- తె. డిగు, డిగ్గి, దిగు : త. మ. ఇఱి, కూ. డీ__(426).
- తె. డెబ్బది, డెబ్బయ్ : త. మ. ఎఱు-పతు, క. ఎఱుపత్తు, ఎప్పత్తు (772)
- తె. త్రంపి : త. తఱల్ 'మండు, నిప్పు', గో. తడ్ మీ (2542).
- తె. త్రాచు : త. అర, అరా, అరవం, మ. అరవు, గో. తరాస్, పెం. రాచ్,మం. త్రెహె, కూ. స్రాసు, కువి. రాచు (1949)
- తె. దతున్ను : త. మ. ఉఱు, క. ఉఱు, కొం. డూ,-.కూ.డూ-(592)
- తె. దతెుప్పి : త. ఉఱై, కో. డుప్పి, ప. ఉడుప్ (598)
- తె. ప్రా-, ప్రాఁత : త. మ. క. పఱ, కూ. ప్డాడి, కువి. ప్డాఇ (3296).
- తె. ప్రేఁగు : ప. ఫిడు ల్, గ. పుడు గ్, గోం. పీర్ (3445).
- తె. ప్రొద్దు : త. పొఱుతు, పోఱ్తు క. పోఱ్తు (3724).
- తె. ప్రొయ్యి : త. మ. పోరి 'వేగు, ఎండు', కూ. ప్రోంద్ (మండు) (3705).
- తె. ప్రోలు (శాస. ప్ఱోల్) క. పొఱల్ (ఊరు). (3721)
- తె. బ్రదుకు, బ్రతుకు : త. వాఱు, క. బాఱు, బఱ్ దుంకు. (4402)
- తె. మ్రాను, మ్రాఁకు : త. మ. మరమ్, గోం. మరా, మార, కూ. మ్రహ్ను, కువి. మ్ఱూను (8856).