Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులిపి పరిణామం

పై అక్షరానికే గుణింతాలు ఇవ్వడం అలవాటయింది. ఇది నన్నయ కాలపు శాసనాలలో కనిపిస్తుంది. ఇది శ్రీనాథుని కాలానికి స్థిరపడింది.

12.26. ఈ ఒత్తులు ఇవ్వడంలోని విచిత్రం మరొకటుంది. తలకట్టు అకారానికి చిహ్నమనేభావం బలపడిన తర్వాత తలకట్టులేనివి అర్థాక్షరాలనేభావం కలిగింది. తలకట్టుకల వాటిసి తలకట్టు తొలగించి, తలకట్టులేని వాటిని ఉన్నవి ఉన్నట్టు పంక్తికి దిగువ చిన్నవిగా వ్రాయడం, చెక్కడం మొదలయింది. క, త, న, య, ర, ల, వ ల ఒత్తులు ఇప్పుడు కొత్తవిగా, మూలాక్షరాలకు భిన్నంగాకనిషిన్తున్నా, నిజానికి పాత అక్షరాల స్వరూపాలే. య ఒత్తును కియ్యవడి, క్యావడి అనీ అంటారు. య ఒత్తుకు, పూర్వపు క ఒత్తుకు భేదం తెలియడానికి క వంటి యవడి అనే వ్యవహారం ఏర్పడి ఉంటుంది. వడి అంటే అక్షరం. ఇలాగే ర ఒత్తును క్రారావడి అంటారు. దీనికి కారణం ఏమిటో తెలియదు. తెలుగు-కన్నడలిపుల సంధికాలంలో క వర్ణపు పశ్చార్థభాగం (అడుగుభాగం) వంటి అకారంగల ర ఒత్తు అని కాబోలు : ఇధి అక్షరం కిందగాక, అక్షరం పక్కన పెట్టేవారు. నేడిది మరుగయింది. ఈ క్రారావడి మరొకరూపం వలపలగిలక, 'కర్మ' అనీ వ్రాయడానికి 'కమ౯' అని వ్రాసేవారు. ర ఒత్తును అశోకశాసనాలనుంచి అక్షరం పై చివరన ఏటవాలుగా వ్రాసే పద్ధతి ఉన్నది. దీనినే క్రమంగా కుడీవైపున గిలకలాగ వ్రాయడంవల్ల వలపలిగిలక అయింది. వలపల అంటే కుడి పక్కన (చూ. తిరుమల రామచంద్ర, మనలిపి పుట్టుపూర్వోత్తరాలు 1957).

12.27. ఇప్పుడు మనం విరామ, సమాప్తుల ల సూచకంగా కామా, ఫుల్‌ స్టాపులను వాడుతున్నాము. కాని, పూర్వం ఒంటి నిలువుగీతను విరామ చిహ్నంగాను, జంటనిలువుగీతను సమాప్తీ చిహ్నంగాను వాడడం కనివీస్తుంది.

12.28. విదేశ పరిపాలనలవల్ల అచ్చుయంత్రాలు రావడంతో మనలిపి మరింత గుండ్రనై, స్థిరరూపం పొందింది. పాశ్చాత్యులు అనుసరిస్తున్న విరామాది చిహ్నాలు అలవాటయ్యాయి. పాశ్చాత్యదేశాలలో ముద్రణ పరిశ్రమ అభివృద్ధిఅయిన కొద్దీ, దాని ప్రభావఫలితాలు మనలిపిమీదనూ ప్రసరించి, టైపు యంత్రాలు, మోనోటైప్, లైనోటైపువంటి నూతన ప్రక్రియలూ రావడంతో అక్షర స్వరూపం చెడకుండా ఎన్నో మార్పులు, సౌకర్యాలు కలిగాయి.

(23)