352
తెలుగు భాషా చరిత్ర
12.22. ఓగుణింతం అశోకుని శాసనాలలో అక్షరం పైన రెండు చిన్న అడ్డుగీతలుపెట్టి సూచించేవారు. ఇవినన్నయకాలానికీ రెక్కలువిచ్చిన పక్షిలాగ మారాయి. కాని, ఓ గుణింతంఇచ్చి, అక్షరం ప్రక్కన కొమ్ముకు దీర్ఘమిచ్చే పద్ధతి కూడ మొదటినుంచీ ఉంది. మ, య, హ లలో మాత్రం తప్పనిసరిగా మిగిలింది. ఏమైనా ఎ, ఏ, ఒ, ఓ ల హ్రస్వదీర్ఘాలభేదం 16వ శతాబ్దివరకు అంతటా పాటించినట్లు కనిపించదు.
12.23. ఔ గుణింతం ప్రాచీన ప్రాకృతశాసనాలలో లేదు. నన్నయకాలానికీ నేటి ల ఒత్తును ఏటవాలుగా పెట్టినట్టున్న గుర్తు కనిపిస్తుంది. శ్రీనాధునికాలానికీ ముక్యాక్షరానికిమించి, నేటి 'ణ' వర్ణం తలమీద మోపినట్టు ఉంటుంది. మ, య వంటి అక్షరాల కొమ్ములకు ఔత్వమిచ్చే పద్దతి ఏర్పడింది.
12.24. సున్నను (అనుస్వరాన్ని) మనమిప్పుడు అక్షరం పక్కన వరుసలో వ్రాస్తున్నాము. కానీ, మొదట అక్షరంపైనగాని, కుడివైపు పై పక్కన గాని పెట్టేవారు. అనుస్వరాన్ని మకారానునాసికాలకు మారుగావాడే పద్దతి వచ్చిన తర్వాత, బిందువు అనునాసికలన్ని౦టికీ సమానమని భావించారు. ఉదా: అమ్భుజ -> అంబుజ, మకారానికి బిందువు వాడడం అశోకుని శాసనాలలోనే ఉంది. కాని, హకారానికి ముందుమాత్రం మకారం వాడడం గిర్ నార్ శాసన౦లో కనిపిస్తుందని శ్రీ ఎ. సి. బర్నెల్ తెలిపారు (SIP 22).ఈ అనుస్వార బిందువును పంక్తిలో వ్రాయడం తెలుగులో నన్నయనాటికీ అలవాటయి౦ది. అక్షరం పక్కన చుక్క కనిపించకపోవచ్చననే ఉద్దేశంతో ఈ చుక్కను నిండుగా, చంద్రమండలంలాగ గుండ్రంగా చెక్కే అలవాటై౦ది.
12.25. మనం ద్విత్వాక్షరాలను ఒత్తులు అంటున్నాము. అశోక బట్టిప్రోలు లిపులలో ద్విత్వాక్షరాలను సూచించడానికి ఒక అక్షరం కింద మరొక అక్షరం చెక్కడం చూడవచ్చు. ద్విత్వాక్షరాలలో పై అక్షరం అప్రదానం; కిందిదిప్రదానం. గుణింతాలు ప్రదానమైన కింది అక్షరానికే చెక్కవలసింది; కాని పై అక్షరానికే చెక్కేవారు. కొంత కాలానికీ ఈ పొరపాటును లేఖకులు, లిపికరులు గ్రహించి కింది అక్షరానికి గుణింతాలు, ఒత్తులు ఇవ్వసాగారు. కాని తలకట్టు స్థిరపడిన తర్వాత