పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులిపి పరిణామం

351

శాసనాలు వేయడం ప్రారంభమైన తర్వాత కనిపిస్తుంది. చాళుక్యుల కాలానికే ఇది వట్రువసుడిగా మారింది. రెడ్డిరాజులకాలంవరకు ఇది అక్షరాన్ని అంటి పెట్టుకొని ఉండేది. విజయనగరకాలానికి అక్షరాన్ని అంటిపెట్టుకోవడం మానింది. సంస్కృత శాసనాలలో ఋకారాన్ని, ఋ గుణింతాన్ని నిర్దుష్టంగా వ్రాయడం పాటించే వారు. గాని, తెలుగు పద్య వచన శాసనాలలో దీనిని రి, రు, క్రారావడిగాను చెక్కేవారు. దీనికి కారణం ఋకారోచ్చరణ విశిష్టంగా ఉండటం. ఔత్తరాహులు దీనిని రిగా పలుకుతారు: మనం రుగా పలుకుతాము. అశోకుని శాసనాలలో ఇది అ, ఇ, ఉ, ఎ లుగా మారింది. మృగ అనే పదం 'మగ, మిగ, ముగ, మెగ” లుగా కనిపిస్తుంది. మనం మ్రిగ, మ్రుగలుగా వ్రాయడం కనిపిస్తుంది. ఉదా: "ప్రిథ్వీవల్లభచోళ కులశేఖర” (SII 4.433), కులోత్తుంగచోడగొంకరాజునకిష్టబ్రిత్యుండైన' (SII 4.211). ఋకారరేఫాల ఉచ్చారణ సామీప్యాన్నిబట్టి కలిగిన భ్రాంతితో రేఫానీకి వట్రువనుడి పెట్టడమూ విరివిగా కనిపిస్తుంది. ఉదా : “సంతేశ్వరకొమార గురువు మహి పాతృల కొమారుడు తిరుమలదాసు మహాపాతృండు” SII 4.197).

12.20. ఏ కారం గుణింతం సూచించడానికి అశోక, భట్టిప్రోలు లిపులలో అక్షరం ఎడమవైపు ఎగువన అడ్డుగీత కనిపిస్తుంది. వేంగీ-చాళుక్యలిపిలో ఈ గీత కొన ఎడమకువాలింది. కాకతీయులకాలంలో కొక్కెంలాగ మారింది. విజయనగరకాలానికి ఇప్పటిరూపం దగ్గరికివచ్చింది. సంస్కృత, ప్రాకృతాలలో హ్రస్వ ఎ కారం లేదు గనుక తెలుగు పదాలు వ్రాసినప్పుడు సందర్భానుగుణంగా హ్రస్వదీర్ఘాలతో చదవవలసివచ్చేది. తర్వాత ఈ దీర్ఘ ఏ కారాన్నే హ్రస్వంగా భావించి దీర్ఘాక్షరం చూపడానికి ఆ అక్షరం కుడివైపునమీద చెక్కారు. అది క్రమంగా కొసవంగి నేటిరూపం పొందింది. ఎ, ఏల ఉచ్ఛారణ తమిళ ప్రథమ వ్యాకరణమైన తొల్‌కాప్పియంలో తెలుపబడిందని, త్రికోణాకారంలోఉన్న ఏకారం హ్రస్వంగా భావించబడి, దానిమధ్యన ఒక చుక్కపెట్టి హ్రస్వ ఎకారంగా చూపబడిందని మద్రాసు మ్యూజియం క్యూరేటర్‌ శ్రీ పి. ఎన్‌. మోహన్‌దాస్ తెలిపారు (శంకర పార్వతి ఎండోమెంట్‌ లెక్చర్స్ 1968 : 15, 16).

12. 21. ఐ గుణింతాన్ని అక్షరానికి ఏ గుణింతం ఇచ్చిన మీదట, అక్షరం కుడిపక్కన కిందుగా అంటిపెట్టుకొన్న అరసున్నవంటి గుర్తు పెట్టేవారు. ఇది కాకతీయుల కాలానికి అక్షరాన్ని అంటిపెట్టుకొనడంమాని, శ్రీనాథుని కాలానికి మొదటి కొనలో సుడి తిరిగింది.