Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

350

తెలుగు భాషా చరిత్ర

పెట్టేవారు. తర్వాత ఇది అక్షరంపైన అడ్డుగీతగామారి, శ్రీనాథునికాలానికే కుడికొస వంగి సుడిదేరింది. విజయనగరకాలంలో ఇది మరింత చిన్నదై స్థిరపడింది.

12.15. ఇ గుణి౦తానికి అకారం సూచించే అడ్డగీతమీద చిన్ని నిలువుగీత పెట్టడం అశోకశాసనాలలో కనిపిస్తుంది. ఇది సాతవాహనులకాలానికి తురాయి లాగలేచి, చాళుక్యలిపిలో తురాయికొస కుడివైపుకువంగి, నున్నగా మారింది. శ్రీనాథుని కాలానికి పెద్ద కమానులాగ అయి, విజయనగరకాలానికి కమాను కుడి కొనలోపలికి సుడితిరిగి నేటిగుడికి మూలమయింది.

12.16. ఈ గుణింతం సూచించడానికి పైన రెండు నిలువుగీతలు పెట్టేవారు. ఈ రెండు నిలువుగీతలు క్రమక్రమ౦గా వర్తులాకృతిదాల్చి ఎడమవైపునకు సుడితిరిగి విజయనగర కాలానికి నేటి రూపానికి సమీపమయింది.

12.17. ఉ గుణి౦తం సూచించడానికి అశోకభట్టిప్రోలు శాసనాలలో అక్షరంకింద అడ్డుగీతకాని, నిలువుగీతగాని కనిపిస్తుంది. ఈ అడ్జుగీత నన్నయ కాలానికి అక్షరం కుడిప్రక్కన అంటుకొని ఉండటం కనిపిస్తుంది. ఇది శ్రీనాథుని కాలానికి కొనపైకివంగి పొడవయింది. విజయనగర కాలానికి ఇప్పటిలాగ తీర్చి నట్టయుంది.

12.18. ఊ గుణింతం తెలుపడానికి అక్షరం అడుగున రెండు నిలువుగీతలు కనిపిస్తాయి. ఇవి భట్టిప్రోలు శాసనంలో హంసపాదుగా మారాయి ; ఇక్ష్వాకుల కాలంలో కుడివైపునకువాలాయి. ఇది క్రమంగా పక్కకు జరిగినప్పుడు ఇంగ్లీషు 'S' అక్షరంలాగమారి, విజయనగరకాలానికి కొమ్ముదీర్ఘంగా ఇప్పటి స్వరూపానికి సన్నిహితమయింది. కాకతీయులకాలంవరకు ప, ఫ, వ లకు ఉకార ఊకార సూచకాలై న కొమ్ము, కొమ్ముదీర్ఘం అక్షరం ప్రక్కనే వ్రాసేవారు. ఇలావ్రాయడం వల్ల ఘకార, మకార భ్రాంతి కలుగుతుందని కాబోలు రెడ్డిరాజుల కాలంనుంచి ఈ మూడక్షరాలకు పొక్కిలిలో కొమ్ము వ్రాయటం అలవాటై౦ది.

12.19. ఋ గుణింతం ప్రాచీన సంస్కృత శాసనాలలో అక్షరం కుడివైపున మూలగా ఒక వంపుతో సూచించేవారు. ఋకారోచ్చారణ ప్రాకృతభాషలో లేకపోవడంవల్ల ఇది అశోకసాతవాహనేక్ష్వాకులకాలంలో కానరాదు. సంస్కృత