పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగులో ఈ వర్ణవ్యత్యయం ధాతువు మొదట హాల్లు ఉన్న పదాలలోనూ లేని పదాలలోనూ కూడా కనిపిస్తుంది. ధాతువు మొదట హల్లు లేకపోతే వర్ణవ్యత్యయం పొందే హల్లు *ట (డ), *ఱ, *ళ, *ల,*ర; *ఱ లలో ఒకటి అయి ఉంటుంది / (సర్వనామాల్లో మరికొన్ని హల్లులున్నపటికీ కూడా వర్ణ వ్యత్యయం జరిగింది.). దీనివల్ల పదాదికి వచ్చిన * ళ కారం ల కారంగానూ (తరవాత అది ద కారంగానూ), * ళ కారం ల కారంగానూ తెలుగులో మారతాయి. ధాతువు మొదట హాల్లు ఉంటే వర్ణవ్యత్యయం పొందే రెండోహల్లు ఱ' ,*ఱ, *ర లలో ఒకటిగా ఉంటుంది. ఈ మూడూ వర్ణవ్యత్యయం తరవాత కావ్యభాషలో ఈ స్థానంలో ర గా మారుతాయి. ఈ రేఫ వ్యావవోరికభాషలో తరవాత నశించింది. వర్ణవ్యత్యయం జరిగిన పదాల్లో ధాతువు మొదట ఉండే హల్టు క, గ, త, ద, ప, బ, మ, వ, స లలో ఒకటి అయి ఉంటుంది. వర్ణవ్యత్యయం జరిగిన తరవాత ధాత్వచ్చూ, నిష్పాదక ప్రత్యయంలో మొదట ఉన్న అచ్చూ మధ్య వ్యవధానం లేకుండా ఉంటాయి కాబట్టి వాటీలో ఈ కింద ఇచ్చిన మార్పులు జరుగుతాయి. నిష్పాదక ప్రత్యయంలో మొదటి అచ్చు ఇ కాని, ఉ కాని అయితే అది పోతుంది. అది అకారం అయితే ధాత్వచ్చూ అదీ ఈ విధంగా మారతాయి :

అ + ఆ → ఆ
ఏ + ఆ → ఏ
ఒ + ఆ → ఓ

ఈ సందర్భంలో మూభలద్రావిడంలోని ఇ, ఉ లు అకారం ముందు తెలుగులో ఎ, ఒ లు గా మారతాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ మార్పు జరిగిన తరవాతనే వర్ణవ్యత్యయం జరిగింది.

వర్ణవ్యత్యయం తెలుగులోనే కాక పెంగొ, మండ, కూయి, కువిలలో కూడా చాలా ప్రచురంగా కనపడుతుంది. గోండీ, కొండలలో కూడా మొదట్లో ఆజుదులై, కొన్ని పదాల్లో వర్ణవ్యత్యయం జరిగింది. కాబట్టి ఈ మార్పు ఈ భాషలన్నీ ఏక భషగా ఉన్న కాలంలో జరిగి ఉండాలి. ఇది. తెలుగు గోండీ, కొండ, పెంగొ, మండ, కూయి, కువి భాషలతో ఆతి సన్నిహితసంబంధం గలది అని చెప్పడానికి ఒక ప్రబలాధారం. వర్ణవ్యత్యయానికి ఉదాహరణలు :