ఈ పుటను అచ్చుదిద్దలేదు
340
తెలుగు భాషా చరిత్ర
ఉర్దూ తెలుగు అర్ధం
హ > Ø(లోపం)
హుషార్ ఉషారు 'ఉత్సాహం'
సిపాహి సిపాయి 'సైనికుడు'
జగహ్ జగా/జాగా 'స్థలం'
పహ్‌రా పారా 'కాపుదల'
షహ్ నాయ్ సన్నాయి 'ఒకరకం మేళం'
మ > మ
మత్లబ్ మతలబు 'ఉద్దేశం'
మదద్ మద్దతు 'అండ, సహాయం'
అమల్ అమలు 'to execute'
తమాషా తమాషా 'వేడుక'
బదనాం బదనాం 'అపవాదు'
న > న
నక్‌ల్ నకలు 'తిరిగి వ్రాసినది (copy)'
నిషాన్ నిషానీ 'గుర్తు'
ఇనాం ఇనాం 'బహుమానం'
మున్షీ మున్షీ 'రాసేవాడు (scribe)'
ల > ల
లూటీ లూటీ 'కొల్లగొట్టటం'
లిఫఫా లిపాపా 'కవరు'
ఆదాలత్ అదాలతు 'న్యాయస్థానం'
ర > ర
రోటీ రొట్టె 'తినుబండారం'
తర్జుమా తర్జుమా 'అనువాదం'
ఫిక్ర్ ఫికరు 'ఆలోచన'