Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

336

తెలుగు భాషా చరిత్ర

     ఉర్దూ                     తెలుగు                 అర్థం       

ట > ట

    టలానా                 టలాయించు            'కాలయాపనచేయటం' 
    అటకానా               అటకాయించు            'ఆపటం' 
    లూట్‌                 లూటీ                  'కొల్లగొట్టటం'

క > ట

    ఠోకర్‌                  టక్కరు                'ఒకదాని నొకటి తగులుకోటం'
    చిటీ                   చిట్టీ, చీటీ              'ఉత్తరం'

చ > చ

   చలాన్‌                 చాలాను                'డబ్బుచెల్లించే పత్రం'
   గచ్‌                    గచ్చు                  'గచ్చునేల'
   చాకరీ                   చాకరీ                   'సేవ' 

ఛ > చ

   ఛత్రీ                   చత్రీ                    'గొడుగు' 
   ఛపానా                 చపాయించు              'ముద్రి౦చటం'

క > క

   కారోబార్‌               కార్వాయి                 'పని'
   చాకరీ                  చాకరీ                    'సేవ'  
   షికార్‌                 షికారు                   'వాహ్యాళి' 

ఖ > క

    ఖాతా                  కాతా                   'లెక్క, లెక్క పుస్తకము'

క > క

    కబ్జా                  కబ్జా                     'ఆక్రమించటం'
    కలమ్                కలం                     'పెన్ను'
    కిస్త్                  కిస్తి                       'వాయిదా'  
   బకాయి                బకాయి                    'ఋణ౦' 
   నక్ ల్                నకలు                     'తిరిగిరాసినది (copy)'