Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులో అన్మదేశ్యాలు

335

చెప్పటంకోసం అన్యదేశాన్ని ఎరువుతెచ్చుకొనేబదులు నిసర్గమై అంతకుముందే భాషలో ఉన్న పదాంశాల పరిసరాల్లో మార్పుతేవడాన్ని (loan shift) అంటారు.

11. 10. ఉర్దూభాషా ప్రభావం ఎక్కువగా కనిపించే తెలంగాణా ప్రాంతపు భాషలో వాక్య నిర్మాణంలోకూడా కొంతమార్పు కనిపిస్తుంది. ఉర్దూలో గమ్యార్థపదానికి చతుర్ధి విభక్తి ప్రత్యయం వాడనవసరంలేదు. కనుక తెలుగులోకూడా అలాంటి ప్రత్యయలోపమే కనిపిస్తుంది. ఉదా: తె. నేను బయటపోయిన, ఉ. మైఁ బాహర్‌ గయా.

11.11. తెలుగులో ఎక్కువగా వాడుకలో ఉన్న కొన్ని ఉర్దూ పదాలు, కింద ఇవ్వబడ్డాయి.

     ఉర్దూ                  తెలుగు                 అర్థ౦

ప > ప

    పహ్రా                 పహరా, పారా             'కావలి'
    దర్యాప్త్               దర్యాప్తు                'పరిశోధన'(investigation)

ఫ > ప

    ఫిరానా               పిరాయించు              'తిప్పు' (to turn)

త > త

    తుక్‌డా              తుకుడా                   'ముక్క'
    తాకీద్‌               తాకీదు                    'ఆజ్ఞ'
    తకరార్‌             తకరారు                    'వివాదం'
    మత్లబ్              మతలబు                    'ఉద్దేశ౦'
    మెహనత్            మెహనత్తు                     'శ్రమ'

థ > త

    థోడా                తోడెం                      'కొంచెం'
    థాల్‌               తల్లె                        'పళ్ళెం'