పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులోని వైకృతపదాలు

325

   ప్రక్క (<పక్క)               పక్ఖ-                       పక్ష-
   హారతి (<ఆరతి)             ఆరత్తి అం                 అరాత్రికమ్‌

(28) తెటుగు దాని ఉపగ్రహ భాషలైన కుజ, కువి, కొండదొర భాషలలో తప్ప మూల ద్రావిడంలోను, ఇతర ద్రావిడ భాషలలోను పధాది సంయుక్తత కన్పించదు. పైన పేర్కొన్న తెలుగు మొదలైన భాషలలో మాత్రం రేఫ ద్వితీయవర్ణంగా కల్గిన పదాది సంయుక్తత విశిష్టలక్షణంగా గోచరిస్తున్నది. ఇట్టి పదాది సంయుక్తత ఈ భాషలలో అర్వాచీన దశలో ఏర్పడ్డదిగా భావించవచ్చు. తెలుగులోని క్రింద, త్రాగు, ప్రాత, బ్రదుకు, మ్రింగు, వ్రాయు, స్రుక్కు మొదలైన దేశ్యపదాలలో రేఫ ఘటిత పదాది సంయుక్తత కన్పిస్తున్నది, వీటి మూలరూపాల (Protoforms) లో సంయుక్ష్తత లేనే లేదు. వర్ణవ్యత్యయం వల్ల ఈ సంయుక్తత ఏర్పడింది. చాల అరుదుగా ఈలాంటి సంయుక్తత పదాదియందు ప్రాకృత భవాలలో కన్పిస్తున్నది.

   క్రీడి                        కిరీడి                        కిరీటిన్‌
   త్రోవ                      కురవయ                      కురవక

(29) తెలుగులోని తద్భవాలు సాధారణంగా తెలుగు నిర్మాణరీతికి అనుగుణంగా వచ్చిచేరాయి. కొన్ని తద్భవాలు కవిపండితుల కల్పితాలుగా సిద్ధరూపాల సామ్యం మీద రూపొందించిన సాధ్యరూపాలుగా కన్పిస్తాయి.

   ఉదుబటుఁడు              ఉబ్బడ-                      ఉదృట-
   చక్కరవతి                 చక్రవత్తి                      చక్రవర్తి
   తిరసకరించు               తిరక్కర-                 తిరస్కారం, తరస్కృ
   దోగి                      ద్రోహి                        ద్రోహి
   మిత్తురుఁడు               మిత్తం                       మిత్రమ్‌
   ముగుదుఁడు              ముద్ధో                        ముగ్ధః
   లక్కుముఁడు              లక్ఖణో                       లక్ష్మణః
   వాలుమీకి                 వమ్మీఅ                      వాల్మీకి
   వెంగము                  వంగ-                       వ్యంగ్య-
   వేసుఁడు                  వాసో                        వ్యాసః