పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  1. తె. అఱువది, అఱు : త. మ. అఱుపత్తు, ఆఱు, క. అఱువత్తు, ఆఱు (2051). (ఆఱులో ఉకారం ఉచ్చారణార్థం.)
  2. తె. కొడుకు: కోడలు : త. కుఱంతై “పిల్ల(వాడు)”, కూ. కోడు 'లేతకొమ్మ, మొగ్గ' కు. ఖోర్‌ 'చిగురు. చిగుర్చూ', మా. ఖోరో 'పిల్ల(వాడు)' (1787).
  3. తె. చెరుగు చేట : మ. చేఱు; క. కేఱు, కో. ప. కేద్‌, క., మా. కేన్‌-(1679).
  4. తె. పఱచు, పాఱు :త. మ. పఱ, పఱి, పాఱు, క. పాఱు (3311).
  5. తె. ప్రొద్దు : త. పొఱుతు, పోఱ్తు, మ. పొఱుతు, పోతు క. పొఱ్తు, గోం. పోడ్ ద్ (3724),
  6. తె. బ్రుంగు : త. మూఱు, మూఱ్కు, ముఱుకు,క. ముఱుంగు,ప. బూ డ్‌ (5096).

2.12 తె. ఎ, ఒ <* ఇ, ఉ (అకారం ముందు).

     సాధారణంగా తెలుగుపదాల్లో రెండో అచ్చు (అంటే నిష్పాదక ప్రత్యయం మొదటి అచ్చు) అకారమైతే మొదటి అచ్చు స్థానంలో అ, ఎ, ఒ లే గాని ఇ,ఉ లు ఉండవు. కన్నడంలో కూడా ఇంతే. కాని ప్రాచీన తమిళంలోనూ, మలయాళంనూ ఆటువంటి ఆకారం ముందు అ, ఇ, ఉ లే గాని ఎ, ఒ లు ఉండవు. కాబట్టి కొన్ని సమాన పదాల్లో (cognates) అకారంముందు ధాతువులో తమిళ, మలయాళాల్లో ఇ, ఉ లు ఉంటే. తెలుగు, కన్నడాల్లో ఎ, ఒ లు ఉంటాయి. ఇటువంటి పదాలు కొన్నింటిలో ప్రాచీనమైన ఎ. ఒ లు తమిళ, మలయాళాల్లో ఇ,ఉ లు గా మారితే మరికొన్నింటిలో ప్రాచీనమైన ఇ, ఉ లు తెలుగు, కన్నడాల్లో  ఎ.ఒ లుగా మారేయి. ఇటువంటి పరిస్థితిలో ప్రాచీనమైన అచ్చు ఏదో తెలుసుకోడానికి అకారంతో మొదలయ్యే నిష్పాదక ప్రత్యయం లేకుండా ఉన్న సమాన పదాలు సహాయపడతాయి. ఇటువంటి సమానపదాలు రెండు రకాలుగా ఉండవచ్చు: (1) దీర్ఘాచ్చుగాని, హ్రస్వాచ్చుగాని ఉన్న ధాతువుమాత్రమే ఉన్నవి; (2) ధాతువు తరవాత ఇ, ఉ లతో గాని, హల్లుతోగాని మొదలయ్యే నిష్పాదక ప్రత్యయం ఉన్నవి(బరో 1968 : 22), ఇటువంటిచోట్ల మూలద్రావిడంలో