పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

324

తెలుగు భాషా చరిత్ర

   అప్పశించు                 అప్ఫాల-               ఆస్పా ల
   దవళము                   ధవల-                 ధవల-
   దేవశము                   దేవఊలం               దేవకులమ్‌ (దేవాలయం)
   వక్కళము 
   (చలించేవి)                   పక్ఖల-                   ప్రస్ఖల  

(25) సమీప మాతృకలోని అపదాది వ, మలు కొన్నిచోట్ల తెలుగులో గ కారంగా కనిపిస్తున్నాయి. వీటి వకార ఘటితరూపాలుకూడా తెలుగులో లేకపోలేదు. మొదట వ కారంగానే నిలిచి, ఆ పిమ్మట గ, వ ల వినిమయంవల్ల గ కారంగా మారి ఉండవచ్చు.

ఈ ధ్వని పరిణామానికి కొన్ని ఉదాహరణాలు :

   ఇగము (<ఇవము            హిమ-                 హిమ-
   తగరము(తవరము)          తమరం                తమరమ్‌
   పగడము (<పవడము)        పవాళో                ప్రవాళః

(26) సమీప మాతృకలోవి మూడక్షరాల పరిమితిగల పదాలలోని అంత్య ద్విరుక్తత తెలుగులో అద్విరుక్త మవుతున్నది. ఇది తెలుగు నిర్మాణరీతి కనుగుణమైన ధ్వని పరిణామంగా నిర్ణయించవచ్చు. తెలుగునందలి పదపరిమాణాన్ని కుదించడమే దీని లక్ష్యంగా తోస్తుంది.

   ఓీలగము                 ఓలగ్గ-                 అవలగ్న-
   బాసట                   పాసట్ట-                పార్శ్యస్థ
   ఓవాట (ఇరు)            ఓహట-                ఆవఘట్ట-
   ఆరతి                   ఆరత్తిఆం               ఆరాత్రికమ్‌
   ఆలతి                   ఆలత్తి                 ఆలప్తి
   సవతి                    సపత్తీ                 సపత్నీ
   చవుతి, చవితి            చఉత్థీ                 చతుర్ధి
   హళది                   హలద్ది                 హరిద్రా
   బచ్చెన                  పచ్చణ్ణ-               ప్రచ్చన్న

(27) కృతకప్రామాణిక రూపాల (Hyper forms)కు కొన్ని ఉదాహరణాలు :