Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

320

తెలుగు భాషా చరిత్ర

   రచ్చ                     రచ్చా                      రథ్యా
   ఒజ్జ                      ఉపజ్ఘాయ-                 ఉపాధ్యాయ-
   ఇట్టిక                     ఇట్టికా                     ఇష్టికా
   అసడ                    అసడ్డా                     అశ్రద్దా
   హత్తి                     హత్థి                       హస్తిః
   ఉద్ధరువు                  ఉద్ధారో                    ఉద్ధారః
   అప్పళి౦చు               అప్ఫాళ-                   అస్ఫాల-
   నిబ్బరము                నిబ్బర                     నిర్భర
 (iv) అనునాసిక వర్ణాలకు పరంగా వచ్చిన మహా ప్రాణాలు తెలుగున అల్ప ప్రాణాలుగా మారడానికి నిదర్శనాలు ;
   సంకలియ               సంఖలి ఆ                 శృంఖలికా
   సింగము                సింఘో                    సింహః
   పించము               పింఛం                     పింఛమ్‌
   సంజ                  సంఝా                     సంధ్యా
   కంటియ                కంఠిఆ                     కంఠికా
   మెంతి                 మేంథీ                      మేంథీ
   గందము                గంధ-                     గంధ-
   కంబము                కంభో                     స్కంభః
 (v) కొన్ని పదాలలో మహాప్రాణత యథా తథంగా నిలిచి పోయింది. ఇట్టి వాటిని ప్రాకృత సమాలుగా పరిగణించడం శ్రేయం, శాస్త్రీయం.
   అజ్ఘము                     అజ్ఘాయ-                 అధ్యాయః
   ఒజ్ఘ(లు)                   ఉపజ్ఘాయో                ఉపోధ్యాయః
   అట్టము                     అట్ట-                    అష్ట
   పైఠాణము(ఓక నగరం పేరు)   పఇట్థాణం               ప్రతిష్టాన-
   ఖాణము (గుఱ్ఱపుదాణా)       ఖాణమ్‌, ఖాయణమ్‌      ఖాదనమ్‌
   ఠవర (నేర్పరి)              ఠవిరో (శక్తిమంతుడు)       స్థవిరః (వృద్ధుఁడు)