ఈ పుటను అచ్చుదిద్దలేదు
318
తెలుగు భాషా చరిత్ర
జమ్మి సమీ శమీ జావ సావ- స్రావ- జడ(సింహాదులకేసరం) సడా సటా,శటా
(g) సమీప మాతృకలోని సకారం చాలా వరకు సకారంగానే నిల్చింది. వీటీని అర్వాచీన రూపాలనవచ్చు.
(1) పదాది రూపాలకు కొన్ని ఉదాహరణాలు :
సన్నము సణ్ణ శ్లక్ష్ణ సిరి సిరీ శ్రీ సున్న సుణ్ణ- శూన్య సేస సేస- శేష సొన్నము సొణ్ణ౦ స్వర్ణమ్
(ii) పదమధ్య సకార ఘటిత రూపాలు :
అస అసా ఆశా దోసము దోష- దోస- రోసము రోస- రోష- వేసము వేస- వేష
(h) (i) సమీపమాతృకలోని చకారం సకారంగా మారడం అర్వాచీనం, ఈ ధ్వని పరిణామం కన్నడాంద్రాలతో దేశ్యపదాలలో సైతం కనిపిస్తున్నది. తెలుగు లోని సలుపు, సాలు, సెలవు, సొక్కు, సొలము వంటి సకారాది రూపాలు చకారాదులకు పరిణతరూపాలు. శ్వాసవత్స్పర్శమైన చకారం, శ్వాసవద్ధంత మూలీయ విస్తారితోష్మం (unvoiced alveolar slit fricative) గా మారడాన్ని తెలుగు వ్యాకర్తలు గసడదవాదేశ విధిగా పేర్కొన్నారు.
సనగ, సెనగ చణగో చణకః సమ్మెట చమ్మేట్టి చర్మయష్టి సపరము చమర-,చామర- చమర-,చామర- సున్నము చుణ్ణ- చూర్ణ-