Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తె. ఏనుగు : త. యానై, ఆనై, మ. ఆన, క. ఆనె, గోం. ఏనీ (4235).

2.9. తె. ఒ <* ఒ

తె. ఒండు : త. ఒన్డు, మ. ఒన్ను, క. ఒందు, తు. ఒఁజి, గోం. ఉందీ, కొం. ఉన్ఱి (334).
తె. బొట్టు : త. మ. పొట్టు, క. బొట్టు (3676).
తె. దొండ : త. తొంటై, మ. తొంటి, క. తొండె, దొండె (2380).

2.10. తె. ఓ <* ఓ

తె. ఓడ : త. మ. ఓటం, క. తు. ఓడ (876).
తె. కోడి : త. మ. క. కోఱి, తు. కోరి (1862).
తె. తోఁట : త. మ. తోట్టం, క. తోట, తోంట (2927).

2.11. ద్రావిడభాషా ధాతువుల్లో దీర్ఘాచ్చు, ధాతువు తరవాత నిష్పాదక ప్రత్యయం లేనప్పుడూ, లేక హల్లుతో మొదలయ్యే నిష్పాదక ప్రత్యయం ఉన్నప్పుడూ దీర్ఘాచ్చుగానే ఉంటుంది. కాని ధాతువు తరవాత అచ్చుతో మొదలయ్యే నిష్పాదక ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రం ధతువులో దీర్ఘాచ్చు హ్రస్వంగా మారుతుంది (కృష్ణమూర్తీ 1955, 1961, pp. 1.288-94). ఇటువంటి మార్పు కొన్ని పదసముదాయాల్లో చాలా ద్రావిడ భాషల్లో కనబడతూ ఉండడం వల్ల ఇది మూలద్రావిడ భాషలోనే మొదలై ఉండాలి. అందువల్ల కొన్ని పదసముదాయాల్లో ఒకే భాషలో దీర్ఘాచ్చుగల ధాతురూపమూ (అచ్చుతో మొదలయ్యే నిష్పాదక ప్రత్యయంతో) మనకు కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన భాషల్లో దీర్ఘాచ్చు ఉండి తెలుగులో అచ్చుతో మొదలయ్యే నిష్పాదక ప్రత్యయం లేక పోయినా ధాతువులో హ్రస్వాచ్చు ఉంటే ఈ హ్రస్వానికి కారణమైన అచ్చు నిష్పాదక ప్రత్యయం మొదట ఒక కాలంలో (అంటే ముందు తెలుగులో) ఉండేదని అది తెలుగులో తరవాత నశించిందనీ మనం ఊహించాలి (కింద 5, 6 ఉదాహరణలు చూడండి).