Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

314

తెలుగు భాషా చరిత్ర

   అక్కసము              అక్కౌస-            ఆక్రోశ-
   అందలము            ఆందోల-            ఆందోల-
   సంతసము            సంతోస-            సంతోష-
 (iii) పై ధ్వని పరిణామరీతికి విపరీతంగా, ఆపదాది దీర్ఘ స్వరాలు నిలిచిపోయిన కింది రూపాలను అర్వాచీన తదృవాలుగా పరిగణించవచ్చు.
   అమాస               అమావస్సా          అమావాస్యా
   బండారము            భండా అర-         భాండాగార-
   పటారము            పట్టార, పట్టాఅర-      పట్టాగార-
   లొటారము            లోట్టాఅర-           లోష్టాగార-
   సింగారము            సింగార-            శృంగార-
 (14) పద మధ్య అచ్చులలోని కొన్ని విశేష పరిణామాలు :
  (i) పదమధ్య అత్వం ఇత్వంగా మారిన రూపాలు :
   జమిలి              జమల-             యమల- 
   పాహిణి              సాహణీ             సాధనీ
   కడియము           కడయం            కటకమ్‌
  (ii) పదమధ్య అత్వం ఉత్వంగా మారిన రూపాలు :
   జనుము             సణ-               శణ-
   సణుగు              సణ-               స్వస-
  (iii) పదమధ్య ఇత్వం అత్వంగా మారిన రూపాలు :
   పున్నమ            పుణ్ణిమా              పూర్ణిమా
   సడలు             సఢిలో               శిథిల-
  (iv) పదమధ్య ఉత్వం అత్వంగా మారింది.
   దేవళము           దేవులమ్‌            దేవకులమ్‌.
  (v) పదమధ్య ఉత్వం ఇత్వంగా మారిన రూపాలు :
   అందియ           అందుయ-            అందుకా
   చక్కిలము          సక్కులీ-              శష్కులీ