ఈ పుటను అచ్చుదిద్దలేదు
తెలుగులోని వైకృతపదాలు
313
(10) అజాదిత్వానికి ఉదాహరణాలుగా కొన్ని రూపాలు :
అరంగు (వేదిక) రంగ- రంగ- ఉరువు రూప- రూప-
(11) పదాది సకారలోపంవల్ల ఏర్పడ్డ కొన్ని అజాది రూపాలు :
ఆమని సావణ- శ్రావణ- ఆవ సాసవ- సర్షపః ఉంకువ సుంక- శుల్క-
(12) పదాది హకారలోపంవల్ల తెలుగున ఏర్పడ్డ కొన్ని ఆజాది రూపాలు:
అనుమఁడు హణుమ- హనుమత్ అరిదళము హరిదల- హరితాల- ఆరణము హరణం హరణమ్ అరునము హరుస- హర్ష ఇంగువ హింగు- హింగు ఇవము హిమ- హిమ-
(13) (i) ద్రావిడ భాషలలో పదమధ్యదీర్ఘస్వరాలు చాలా అరుదు. ప్రాకృత భవాల్లోని పదమధ్య దీర్ఘస్వరం తెలుగులో హ్రస్వ మవడానికి కొన్ని ఉదాహరణాలు (వీటిని ప్రాచీన తద్భవాలుగా చెప్పవచ్చు.) :
ఆకసము ఆకాస- ఆకాశ- అమవస అమావస్సా అమావాస్యా ఇంగలము ఇంగాల- అంగార- కుప్పసము కుప్పాస- కూర్పాస-
(ii) పదమధ్యదీర్ఘస్వరాలైన ఊ, ఏ, ఓ లు కూడ తెలుగున హ్రస్వ ఆ కారాలుగా మారాయి.
జలగ జలూగ- జలూక- మందన, మందసము మంజూసా - మంజుషా అచ్చ(చ్చె)రువు ఆచ్చేరం ఆశ్చర్యమ్