పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులోని వైకృతపదాలు

311

   అచ్చర              అచ్చరా           అప్సరాః
   అకసము             ఆకాస             ఆకాశం
   ఇచ్చ                ఇచ్చా            ఇచ్చా
   ఈసు                ఈసా             ఈర్ష్యా
   ఉగ్గడన             ఉగ్ఘాడన-          ఉద్ఘాటన-
   ఊసర              ఊసర-           ఊషర -
   ఏకతము            ఏక్క-ంత.         ఏకాంత-
   ఓలగము            ఓలగ్గం           అవలగ్న-
   
(2) కింది ఉదావారణాల్లో మార్పు కనిపిస్తున్నది :
   జవ్వనము          జోవ్వణం         యోవనమ్‌
   ఉంగరము          అంగురీయ       అంగులీయ
   ఉంగుటము         అంగుట్ట         అంగుష్థ
   
(3) ఉభయోష్ట్య వ్యంజనాలమీది అకారం ఓష్థ్యమైన ఒ కారంగా మారిన రూపాలు.

   పొత్తరము,పొత్రము      పత్థర_          ప్రస్తర-
   బొందు                బంధో           బంధః
   బొబ్బర                బబ్బరో          బర్బరః
   బొమ్మ                 బంభ-          బ్రహ్మన్‌
   బొమ్మరము (బౌంగరము) భమ్మర-        భ్రమర-
 (4) సమీప మాతృకలోకి పదాది హల్లులమీది సంవృత స్వరమైన ఉత్వం తెలుగులో అర్థ సంవృతమైన (half close) ఒకారంగా మారిన రూపాలు.
   కొంతము              కుంత-          కుంత
   కొలము               కుల-           కుల- 
   గొనము               గుణ-            గుణ- 
   మొల్లము             ముల్లమ్          మూల్యమ్
 (5) సమీప మాతృకలోని ఆవ-ఆవు-లు తెలుగులో వికల్పంగా ఔకారంగా పరిణమించాయి.