ఈ పుటను అచ్చుదిద్దలేదు
310
తెలుగు భాషా చరిత్ర
ఉత్తుఁడు యుక్తః జుత్తో ఎక్క (లి) యక్షః జక్ఖో
(6) పదాదిహకారలోపం :
ఇతవు హితమ్ హిఅ, హియ
(7) అపదాది దీర్ఘస్వరం హ్రస్వమైన రూపాలు కొన్ని :
కస్తురి కస్తూరీ కతూరి పసదనము ప్రసాధనమ్ పసాహణం విరటుఁడు విరాటః విరాడో సోపనము సోపాన- సోవాణ-
(8) మహా ప్రాణాలు అల్పప్రాణులైన రూపాలు కొన్ని :
గోదుమ గోధూమ గోహుమ బొజుఁగు భుజంగః భుయంగో వదిన వధూనీ వహూణీ
(9) వర్ణసమీకరణం (Assimilation) :
నిత్తైము నిత్య జిచ్చ, నిచ్చ పత్తెచ్చము ప్రత్యక్ష పత్తక్ఖ సత్తెము సత్య సచ్చ సోద్దెము చోద్య చోజ్జ౦
(10) కేవలం పదాలేకాక సంస్కృతంలో ప్రసిద్ధంగా వాడుకలో ఉన్న కొన్ని ప్రత్యయాలు సైతం తెలుగులోనికి రావడం ఒక విశిష్ట పరిణామం.
10.9. ఇక ప్రాకృత భవాల సంగతి పరిశీలిద్దాం :
ముఖ్యధ్వని పరిణామాలు :
(1) పదాద్యచ్చులలో ప్రాయికంగా మార్పు కనిపించదు.
తెలుగు ప్రాకృతం సంస్కృతం.
అక్కరము అక్ఖర- అక్షర-