Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులోని వైకృతపదాలు

309

   10.8. మొదట సంస్కృతభవాలలోని ముఖ్యధ్వని పరిణామాలను పరిశీలిద్దాం.


   (1) స్వరవిభక్తి లేక విప్రకర్ష (Anaptyxis) :
తెలుగు                      సంస్కృతం            ప్రాకృతం

అలుపము                       అల్బ-               అల్ప-
కసుమాలము                     కశ్మల-               కమ్హల-
చందురుఁడు                     చ౦ద్ర-               చందో- 
నిద్దుర                          నిద్రా                 నిద్దా
మరియాద                       మర్యాదా              మజ్జాయా  
రాతిరి                           రాత్రి-                రత్తి-
లగనము                        లగ్న-                 లగ్గ-

   (2) సంయుక్తత నిలిచిన రూపాలు కొన్ని :

కస్తురి                         కస్తూరీ                 కత్థూరీ 
కర్జూరము                      ఖర్జూర-                ఖజ్జూర-

   (3) సంస్కృతంలోని పదాదిరేఫ నంస్కృతభవాలలో లోపించలేదు. సంయుక్తతలోని ద్వితీయవర్ణమైన రేఫ ప్రాక్సృతాలలో సర్వేసర్వత్ర లోపిస్తుంది.
తెలుగు                   సంస్కృతం             ప్రాకృతం

క్రోసు                        క్రోశః                   కోసో
ద్రోపది                       ద్రౌపదీ                దోవఈ 
ప్రతిన                       ప్రతిజ్ఞా             పఇణ్ణా, పడిణ్ణా
ప్రోడ                    ప్రౌఢః ప్రౌఢా              పోఢ, పోఢా

   (4) అజాదిత్వాని (Prothesis) కి ఉదాహరణ :
 
 అరదము                   రథః                   రహో
 
   (5) పదాది యకార లోపం :
   
అమడలు                   యమల-               జమల
అసము                    యశన్‌                 జసో
ఉవిద                     యువతీ                 జువఈ