పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులోని వైకృతపదాలు

307

తీరుతుంది. తెలుగుభాష ప్రకృతరూపం ధరించడానికి అనేక భాషలు దోహదం చేశాయి. తెలుగుతో సంసర్గం పొందిన మొదటి భాషలు సంస్కృత ప్రాకృతాద్యార్య భాషలూ, తమిళాదీతర సజాతీయభావలూ; ఇటీవలిది ఇంగ్లీషుభాష.

   ఐతిహాసిక కాలంలో. విజేతలయిన ఆర్యభాషావ్యవహర్తల రాజకీయాధికారమూ, వైదికజైన బౌద్ధమతాల సంసర్గమూ, ఆర్యభాషా, సంస్కృతులూ కారణాలుగా సంన్కృత ప్రాకృత భాషల ప్రభావం తెలుగుపై చాలా ఎక్కువగా పడింది. ఈ ముద్ర ఆనాటితోటే ఆగిపోలేదు. నాటినించీ నేటిదాకా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పాటి స్థాయితో ఆ భాషల అధికారం తెలుగుమీద అవిచ్చిన్నంగా చెల్లుబడి అవుతూనే ఉంది. అనుస్యూతమైన ఈ ప్రభావం కారణంగా కొన్నివేల ఎరవుపదాలు-శాబ్దికమైన మార్చులనుపొంది కొన్నీ, పొందకకొన్నీ-తెలుగులో ప్రవేశించాము. శాబ్టిక పరిణామం పొందని పదాలను తత్సమాలనీ, పొందిన వాటిని తద్భవాలనీ శాస్త్రకారులు పరిభాషించారు. అలాగే తెలుగుకు సోదరభాషలైన తమిళం కన్నడంవంటి పరిసరస్థథాషల ప్రభావంసైతం అన్నియుగాలలోను, అంతో ఇంతో తెలుగుమీద లేకపోలేదు. మధ్యయగాలలో అరబ్బీ, తుర్కీ, ఫారసీవంటి మధ్యప్రాచ్యభాషల ప్రభావం ప్రత్యక్షంగానో, నవీనౌత్తరాహ భాషలయిన ఉర్జూ (దక్ఖినీ), మరాటీ మున్నగు భాషల ముఖంగానో తెలుగుపై ప్రసరించింది. ఇంచు మించుగా ఇదేకాలంనించి ఉర్జూ ఒరియా మరాటీ భాషల స్వీయ ప్రభావంకూడా యౌగపద్యంగా తెలుగుమీద పడుతూనే వచ్చింది. ఇక ఇంగ్లీషు కుంఫిణీ యుగంలో పడమటి సీమల భాషలయిన పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి భాషల ప్రభావం ఒక మోస్తరుగానూ, నాటినించి నేటిదాకా ఇంగ్రీషుభాషా ప్రభావం అతివేలంగానూపడి నూతనావశ్యకాల కనుగుణంగా తెలుగుభాష పరిపుష్టం కావడానికి దోహదంచేసింది (Galletti, Introduction, p. XI). అవిచ్ఛినంగా ప్రసరిస్తూ, వస్తున్న ఈ పరభాషా ప్రభావం తెలుగుపై పరిగణించదగ్గ పరిణామాలను కల్పించింది.
   10.7. పదజాలవిభాగంలోనూ వాటి నిర్వచననిరూపణాలపట్లనూ తెలుగు లాక్షణికులలో ఏకవాక్యత కనిపించదు. విశేషించి వీరి ఈ విభాగం తక్కిన భాషలమాట అటుంచి తెలుగుకుకూడ పూర్తిగా వర్తించదు. తత్సమ, తద్బవ, దేశ్యాలని వీరి విభాగ ప్రక్రియను స్థూలంగా నిర్దేశి౦చవచ్చు. ఈ పరిభాషాకల్పన కూడ ఆంధ్రలాక్షణికుల సొంతంకాదు; ప్రాకృత లక్షణ గ్రంథాలనించి ఎరవు తెచ్చిన పరిభాష (R. Pischel). అయితే ప్రాకృతలాక్షణికులు ఉపయోగించిన