పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

302

తెలుగు భాషా చరిత్ర

   10.2. ఒక మాండలికంగాని, భాషగాని, మరొక మాండలికం, లేక తదంతర్గతమయిన వైయక్తిక వ్యవహారం (idiolect) నించిగాని మరొక భాషనించిగాని పదాలను ఎరవు తెచ్చుకోవడం, మామూలుపాతను పునరుద్ధరించడానికో, లేక హేళన చేయడానికో, పాతకాలపు సన్నివేశాలను పాత్రోచితంగా, రసోచితంగా చిత్రించడానికో ఒక భాషలో వ్యవహార విదూరమైన పూర్వయుగాలలోని పాతవడ్డ మాటల (archaisms) ను కొందరు కవులూ, పండితులూ ఎరవు తెచ్చుకోవడం కద్దు. అలాగే ఒక భాష మరొక భాషనుంచి ఎరవు తెచ్చుకోవచ్చు. ఒకే భాషలోని రెండు మాండలికాలమధ్య, లేక ఒకే మాండలికంలోని విభిన్నవైయక్తిక రూపాలమధ్య ఆదాన్నప్రదానాలు అసాధారణం కావని శాస్త్రవేత్తలు స్పష్టపరిచారు (Hockett 1958-403: Sturtevant, Introduction to Linguistic Science, 1947: 1948). ఒకే భాషలోని వేర్వేరు మాండలికాలనుంచి గాని(dialect borrowing), అదే భాషయొక్క పూర్వదశలనించిగాని మాటలనుఎరవు తేవడాన్ని బహిరదానం (external borrowing) అని పరిభాషిస్తున్నారు. (Robert A. Hall Jr. Introductory Linguistics, 1964:319). రూపసామ్యం కారణంగా ఓక భాషయందలి ఒక దశలో పదాలను సృష్టించడం అంతరాదానం (internalborrowing) అని అంటున్నారు (Ibid :  323-327). భాషల సంసర్గ స్వరూప స్వభావాల స్థాయీభేదం ఎలాంటిదయినా, ఈ ప్రభావం భాషాంగాలన్నింటా ఏకరూపంగా ప్రసరించదు. సాధారణంగా భాషలలోని పదజాలం ఈ ప్రభావానికి లోనవుతూంటుంది. అందులోనూ మూ ర్తపదార్థబోధకాలు విరివిగా వినిమయమవుతూ ఉంటాయి. వర్ణనిర్మాణంలోకూడా ఈ స్వభావం ఉండకతప్పదు. రూప నిర్మాణంలోను, వాక్యరచనలోను సంసర్గప్రభావం ఉత్తరోత్తరా విరళంగా కన్పిస్తుంది. సంసర్గంలోని రెండుభాషల నిర్మాణరీతుల యందలి వైషమ్యం ఎంత అధికంగా ఉంటే పరిణామస్థాయి అంత అధికంగా ఉంటుంది. సజాతీయభాషలూ విజాతీయభాషలూ అనే విచక్షణతో నిమిత్త౦లేకుండా అన్ని వాగ్రూపాలకీ ఈ పరిణామ ప్రక్రియ ప్రవర్తిస్తుంది.
   10.8. అయితే ఒకవ్యక్తి యొక్క వాగ్వ్యాపారంమీద అనేక భాషా వ్యవహారంవలని ప్రభావం, అనేకానేక ఇతర కారణాలవల్ల మారుతూ ఉంటుంది. వీటిలో కొన్ని భాషాతీత విషయాలుకూడా లేకపోలేదు. భాషాతీతాంశాలనుకూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు సాంస్కృతిక ప్రసారణం,పరభాషానిరోధ౦ - ఇత్యాద్యంశాల