పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికయుగం : గ్రాంథికవ్యావహారిక వాదాలు 297

సిద్ధాంతములతోడనే కాలము వృథ సేయచున్నారు.” --పానుగంటి, 'ప్రకీర్ణోపన్యాసములు' పే. 255.

11. (a) "గ్రాంథిక, వ్యాహారికములనుపేర 1918 సంవత్సరమున నుండిన వైమత్యము 1948రో చాలవఱకు నశించిపోయినది. 1968లో ఆ భేదమే చెప్పుకొనవలసిన యవసరములేదు. అయినను కొందరు మృతసర్పములను మోదువారు ఎప్పుడైనను ఆ భేదమును స్వలాభముకొఱకు పేర్కొను చున్నారు. ప్రజారంజనముకొఱకు బయలుదేరిన సినిమాలు, రేడియో ప్రసారములు, వారపత్రికలు, దైనికపత్రికలు భాషకొక నూతనస్థితిని తెచ్చిపెట్టినవి.... చక్కని నుడికారము సిద్ధమగుచున్నది. అది మనము మాటాడుభాషకు విశేషము దూరముకాక, మాండలిక భేదములను తొలగించి, మధురమై విశిష్టముగా నున్నది.” -గం. జో. సోమయాజి, ఆంధ్రభాషా వికాసము (1968), పే. 598.

(b) "A natural National Language, spoken and written, means that the whole people can join in the work of developing national civilization and reap its fruits, as homely and intelligible" -Sten Konow, వ్యాససంగ్రహం, పే.29.

(c) "Clevage between the spoken and the literary language can not but have the most disastrous effects on all higher education" -Otto Jesperson, LNOD, pp:300,301.

12.(a) "A common nation holds that great writers, such as Shakespeare and Milton, are the architects of the English language ; that is that individuals of special literary ability are those primarily responsible for the shape a language takes in the mouths of subsequent generations of ordinary speakers. This theory ... is held with amazing tenacity by some scholars. Yet there is not a shred of evidence in its support..." -Charles F. Hockett: A Course in Modern Linguistics (1958), p. 563.

(b) "The architects of our language are not literary artists, but the masses of people who use the language for every day purposes. The greatness of a literary artist is not measured in terms of his stylistic novelty.. but by the extent to which he can develop freedom and