296 తెలుగు భాషా చరిత్ర
(c) “పూర్వ వ్యాకరణము లనుటచే.... మహాభారతమే గ్రామ్యపద భూయిష్టము గావలసివచ్చును. (పే.386).... సద్వ్యవహారమున నున్న భాషానియమమునెత్తి వ్రాసిన నదియె వ్యాకరణము. కాబట్టీ తత్తత్కాల వ్యవహార భాషకుఁ దత్తత్కాలిక వ్యాకరణములు ప్రమాణమయి యుండును (పే. 389)... పురాతనాంధ్రవ్యవహార కాలమున సనాగరకవ్యవహారస్థము లగటచే నవి గ్రామ్యములే యైనను వానిలో 'పంపేరు, తెంపేరు, చూసేరు, ఇస్తిని' మొదలగు పదము లిప్పటి నాగరకవ్యవహారభాషలో బ్రవేశించినవి గనుక నవి యీ భాషలో గ్రామ్యములు కావు. తక్కిన 'యినుతి, యిందాము, సూసేరు' మొదలగు పదము లిప్పటికిని గ్రామ్యజన వ్యవహారమాత్రస్థలములే యగుటచే నవి యీ భాషయిందును గ్రామ్యములే యనుట నిర్వివాదా౦శంము (పే. 391) -వజ్ఘల చిన సీతారామస్వామిశాస్త్రి, 'ఆంధ్రభాష', ఆం. సా. ప.ప. సం. 2. సం. 4 (1912).
9 (a) “In the first Cristian centuries the influence of Latin was so overpowering in official life and in the schools that it obstructed a natural development. But soon after the 3rd century, the educational level rapidly sank, and political powers broke the power of not only of Rome, but also of its language. The speech of the masses, which has been held in fetters and with elemental voilence, the result being those far-reaching changes by which Romantic languages are marked off from Latin. Language and nation or race must not be confounded" - Pucariu as quoted in Language, its Nature, Origin and Development Otto Jesperson, p. 206.
(b) “ఏ రూపమున భాషయుండవలయను-చేయచు అని వ్రాయవలెనా, చేస్తూ అనియా యనునది యల్ఫవిషయము. ఏ రూపమున వ్రాసినను అభ్యంతరము కలుగదు. భాషకు ఏక విధమయిన ప్రామాణికత్వము వెలయ వలయును. ఆ ప్రామాణికభాషకే ఒక్కతీరుననే వ్రాతయు, మాటయు శ్రేష్టులలోనైైన నుండవలయను. అప్పుడు వారినే సామాన్యులనుకరించుటచే భాషకు ఉన్నతికలుగును. మార్పువిషయమున భాషాచక్రము వెనుకకు తిరుగదనియు, ముందునకే పోవుననియను భాషావిదుల యనుభవము” --గం. జో. సోమయాజి, ఆం. భా. వి. (1969). పే 597,
10. "పేరున్నవో లేనివో యుండందగిననో కానివో, యేవో కొన్ని గ్రంథములను గ్రాంథికవాదులే వ్రాసిరీగాని గ్రామ్యవాదులు వ్యావహారికభాషాశబ్దార్ధవిషయకపూర్వపక్ష