Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికయుగం : గ్రా౦థిక వ్యావహారికవాదాలు 295

(b) “అన్ని వ్యాకరణములకంటె విపులమగు పాణిని వ్యాకరణముగూడఁ బూర్ణముగను నసందిగ్ధముగను, భాషను సంస్కరింప సమర్థము కాకపోయెను. ఈవిషయ మాకృతిగణములు చెప్పుటవలనను, 'పృషోదరాదీని యథోపదిష్ట” మ్మనెడి సూత్రమునలనను, దత్సూత్ర భావ్యమువలనను స్పష్టమగుచున్నది. (పే. 277) .. ప్రకృతము బ౦గాళాాభాషను సంస్కరించి యందు నూతన గ్రంథములను వ్రాయుట యెల్లరకుం దెలిసినదే. ఇట్లె ప్రాచీన కర్ణాట మనియు నూతన కర్థాటమనియు విభాగము గలిగనది. ప్రకృతమగు నాంధ్ర భాషలోను 'దేశ్యము' 'గ్రామ్యము' అని విభాగించిరి. ఈ విభాగమునకుఁదాత్సర్య మాలోచింపఁగా నా౦ధ్రదేశమునం దంతటను వాడుకలోనుండు పదములు దేశ్యములనియుఁ గొన్నికొన్ని గ్రామములలో మాత్రము వాడుక చేయఁబడు పదములు గ్రామ్యములనియ, గ్రామ్యపదములను గ్రంథములలో వ్యవహరించినచో నా గ్రంథమునందతటను విదితములు కావుగనుక వానిని విడిచి దేశమంతటను దెలిసికొనందగు దేశ్యపదములను వ్యవహరించుట సకలాంధ్ర దేశోపకారమనియుఁ బ్రాచీనుల యభిప్రాయమని నిశ్చయింప నవకాశము కలదు. నగరములందును, నగరప్రా౦తగ్రామములందును, వాడుకచేయబఁడు భాష దేశ్యమనునట్టి కేతన కిదియే యభిప్రాయమని చెప్పవచ్చును. ఎట్టనఁగాాఁ బట్టణములలో నుండు జనులకుఁ బరస్పర సంబంధ ముండినట్లు పల్లెలలో నుండువారి కుండదు. పరస్పర సంబంధమున్నపుడు బాష యేకీభవించుట కవకాశము గలదుగాన నట్టి భాష దేశవిదితిమని కేతన యూహించినట్లు చెప్పవచ్చు. అట్లు కానిచో దేశ్య శబ్ధసారస్యమునకు భంగముకలుగును. (పే. 278)... ప్రాచీన కవులకట్టి స్వాతంత్ర్యముండుటను, బ్రకృత కవులకు లేకుండుటకును, గారణమండునా ? గ్రంథకర్తలు కాకున్నను బ్రాఙ్ఞు లగు నాగరకు లార్యులు కాకుందురా ? వారి వ్యవవారము గూడ నేలగ్రాహ్యము కాాఁగూడదు ? (పే. 280)-భాషయనఁగా స్వాభిప్రేతార్థమను నితరులకు వ్యక్తపఱచుటకై యుచ్చారితవర్షసమూహము కాని వర్ణానుమాపక రేఖాసముదయము కాదు. ఈ నిర్వచనమును, మహాభాష్యము నందుఁబతంజలి “యే నోచ్చారితేన సాన్నాదిమానర్థఃతీయకతే స శబ్దః" అను గ్రంథముచే స్పష్టపఱచెను. 'ఉచ్చారిత ఏవ శబ్దః ప్రత్యాయకో నానుచ్చారితః' అను భాష్య గ్రంథముగూడ నీ నిర్వచనమునే సూచించుచున్నది. ఉచ్చారణభేదము లేనిచో లిపిభేదము శబ్దభేదప్రయోజకము కానేరదు. ప్రకృతకాలమున నర్థానుస్వారరేఖ యుచ్చారణభేదజ్ఞాపకము కాకుండుటచే నిది యనావశ్యకము (పే. 282)....ఇట్లే శకటరేఫ మనావశ్యకమని యూహించునది” (పే. 283)-తాతా సుబ్బరాయశాస్త్రి. 'ఆంధ్ర భాషా సంస్కరణము', ఆం, సా.ప. ప. సం. 2, సం. 3 (1912).