పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికయుగం : గ్రా౦థిక వ్యావహారిక వాదాలు 291

జయప్రదంగా సాగించిన "చలిత్‌ భాషా” ఉద్యమం, తరవాత తెలుగు దేశ౦లోకి అడ్డులేకుండా ప్రవేశించిన వంగగ్రంథానువాదాలూ అంతో ఇంతో ఇందుకు సహాయపడ్డాయి. ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక వికాసాలకు మొదట బీజావాపనం జరిగిన తీరా౦ధ్రలోనే భాషాభ్యుదయవాదంకూడా వచ్చినందువల్ల మొదటితరం రచయితల్లో రాజకీయనాయకుల్లో సంఘసేవకుల్లో అత్యధిక సంఖ్యాకులు అక్కడివారే అయినందువల్ల, ఆధునికప్రచారసాధనాలూ వార్తా సౌకర్యాలూ అక్కడే ఎక్కువగా ఉన్నందువల్ల, ఆ ప్రా౦తపు భాషభేదమే ఆధునిక ప్రామాణిక భాషగా పరిణమించింది. ఈ శతాబ్దంలోనే తీరా౦ధ్రభాషే నేటి ప్రామాణికభాష అని గుర్తించటం జరిగింది.24 ఇతర ప్రాంతాలనుంచి వెలువడే పుస్తకాల్లో పత్రికల్లో రేడియోలో సినిమాలలో ఇదే భాషాభేదం కొద్దిపాటి మార్పులతో కనిపిస్తునది - వినిపిస్తున్నది. గిడుగువారి ధర్మమా అని తెలుగు సాహిత్యానికి నూతనోత్తేజ౦ భాషకు నూతనవికాసం కలిగేయి. శాస్త్రవిజ్ఞానాన్ని అందించటానికి, అధికారభాషగా అధునికప్రభుత్వయంత్రా౦గాన్ని నడపటానికీ ఈ ప్రామాణికభాషే ఇప్పుడు ఉపయోగపడుతున్నది.

జ్ఞాపికలు


1. (a) “Each of the southern languages has a poetical and a vernacular dialect which vary as widely as Saxon varies from English" -C. P. Brown, Preface to Tel. - Eng. Dictionary, p. iv.

(b) 'It is a remarkable peculiarity of the Indian Languages that, as they begin to be cultivated, the literary style evinces a tendency become a literary dialect district from the dialect of common life with a grammar and vocabulary of its own" -Robert Caldwell, p. 4, as quoted by Gurajada, Minute of Dissent, p 54.

(c) “Hindu Grammarians, like those of China, neglect the colloquial dialect, which they suppose is already known to the student, and teach only the poetical peculiarities" -C P. Brown, Preface to a Grammar of the Telugu Language, p. 11.

(d) “In Telugu the dialect used in ordinary conversation differs so much from that used in grammatically written