పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

290 తెలుగు భాషా చరిత్ర

అందులోని విభాగాన్నో ప్రత్యేకకృషి చేసి నేర్చుకొంటున్నట్లే, సాహిత్యాభిమానం కలవాళ్ళు తమకు నచ్చిన వాటిని చదువుకుంటారు. నిర్బంధంవల్ల చదువు రాదు. నిర్భ౦ధంలేదని చదివేవాళ్ళు తగ్గరు. పూర్వకావ్యాలకు ఈ కాలపుభాషలో అర్థాలు చెప్పుకొని ఇప్పటిభాషలో అర్థంచేనుకొని వ్యాఖ్యానాలు రాస్తుంటారు. ప్రపంచ సాహిత్యం అంతటా ఇదే స్థితి.

9. 24. గ్రాంథికవ్యావహారికవాదాలవల్ల ఇరవయ్యో శతాబ్దంలోని తెలుగు భాషకు మేలే చేకూరింది. తొలి రోజుల్లో మంచి పుస్తకాలు ఆధునికభాషలో లేకపోయినా రాకపోయినా రచయితలు ఈ వివాదాలను పండితులకు వదిలివేసి తమకు నచ్చిన విధంలో అనేక నూతనసాహిత్యప్రక్రియలను తెలుగుకు ప్రసాదించారు. కొద్దిమంది సనాతనవాదులు ప్రాచీన కావ్యాభాషలో ఇప్పటికీ సాధన చేస్తున్నారు. మరికొంతమంది అరసున్నాలు, విస౦ధులు, బండిరాలు విసర్జించి అర్థగ్రా౦థికంలో పాఠ్యగ్రంథకర్తృత్వం కోసం పాకులాడుతున్నారు. అయితే నూటికి తొంబై మందికి పైగా ఆధునికభాషలోనే రాస్తున్నారు. మొదటమొదట కసిగా అన్యభాషా పదాలను విశృ౦ఖలంగా వాడి గ్రాంథికవాదులను విసిగించాలని కొందరు ప్రయత్ని౦చినా 1925 ప్రా౦తాలనుంచి సరళసుందరరచన అనేకం వచ్చాయి. : వస్తున్నాయి. అయితే ఆధునికభాషాస్వరూప మేమిటని ప్రశ్నించవచ్చు. కృష్ణా గోదావరీ నదులకు ఆనకట్టలు కట్టగానే వ్యవసాయమూ, దానివల్ల ఆర్థికపరిస్థితులూ సాగరతీరంలో బాగుపడ్డాయి. రాజకీయ ప్రాబల్యం చేకూరింది. పత్రికలు అశేషంగా బయలుదేరేయి. ఆధునికప్రయాణసౌకర్యాలు, రేడియో వంటి వార్తాసౌకర్యాలూ ఏర్పడ్డాయి. పాఠశాలలూ కళాశాలలూ సంఖ్యాధికంగా పెరిగి ప్రజాసామాన్యానికి చదువు ఆశ్రమంగా లభించటం మొదలయింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడగానే ఉన్నతవిద్య అందుబాటులోకి వచ్చింది. కందుకూరి వీరేశలింగంగారు తమకు తెలిసి సంఘసంస్కారాన్ని, తెలియకుండా భాషా సంస్కారాన్ని23 తీసుకరావటం తరువాతి వారికి ఆదర్శమయింది. వేదం వేంకటరాయశాస్త్రిగారు 'ప్రాతోచితభాష' పేరిట అవ్యక్తంగానే ఆధునికభాషకు స్థానం కల్పించారు. గిడుగు వేంకటరామమూర్తి గారి ప్రచారధోరణి, గురజాడ అప్పారావుగారి రచనా ధోరణి ఎందరికో ఆదర్శమైనాయి. రచయితలు భావకవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వంవైపు మొగ్గుచూపేసరికి ఆనాటి రాజకీయ వాతవరణం కూడా వ్యావహారికోద్యమానికి సహాయపడ్డది. రవీంద్రనాథఠాకూర్‌ వంగదేశ౦లో