పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికయుగం : గ్రాంథిక వ్యావహారిక వాదాలు 289

మన పూర్వకవులే నిదర్శనం. షేక్స్‌పియర్‌ కవితకు అందువల్ల లోపంలేదని క్రాటర్‌ అంటాడు. 21 సజీవ మాండలికాలను వాడటానికి అభ్యంతర మున్నప్పుడు గతానుగతిక సంకేతమయమైన నిస్సార గ్రాంథికరచనలు చేయటానికి అనంగీకారం అక్కరలేదా ? ఏ రచయితా పరప్రాంతీయులకు దురవబోధకమైన మాండలిక భూయిష్ట గ్రంథాలను రాయడు. నిజానికి ప్రపంచంలోని అనేకభాషలు ఏదో ఒక మాండలికంనుంచి ఏర్పడ్డవే. డాంటె టస్కన్‌ మాండలికంలో కవిత్వం చెప్పాడు. షేక్స్‌పియర్‌ లండన్‌ మాండలికంలో నాటకాలు రాశాడు. లాఁకషైర్‌ మాండలి కంలో వౌ, డార్సెట్‌ మాండలికంలో బార్నెన్‌, ఇంకా ప్రముఖంగా స్కాచ్‌ మాండలికంలో బర్న్స్‌ రచించారు (వ్యాసావళి, పే. 85) ఇలా అనేకం. అయితే తొలిదశలో మాండలికాలుగా ఉన్న భాషాభేదాలు కాలమాన అనుకూలపరిస్థితుల్లో ప్రామాణికత్వాన్ని సంపాదించుకొంటాయి. అలాంటి పరిస్థితుల్లో గొప్ప రచయితల గ్రంథాల్లో నిమంటువుల్లో ప్రవేశించటమే ప్రామాణికత. ఇష్టంలేనివారు మాండలిక రహితంగా రాయవచ్చునని అసలు రాయటమే మానతామనటంకాని, ప్రాచీన భాషలోనే రాస్తామనటంగాని అర్థరహితం.22

9. 23. గ్రాంథికవాదులు వ్యావహారికరచనలు సుబోధంగాలేవని ఆక్షేపించటాన్ని పరిశీలించాలి. పూర్వకవుల గ్రంథాలన్నీ ఒకే విధంగా అర్థమయ్యే స్థితిలోగాని, అర్థంకాని స్థితిలోగాని లేవు. ఆయా వ్యక్తుల అభిరుచులనుబట్టి, విషయాలనుబట్టి, రాసేతీరునుబట్టి, పాఠకుల అధికారాన్నిబట్టి అర్ధంకావటమో కాకపోవటమో జరుగుతుంది. వ్యక్తి నిష్టమైన ఈ లక్షణాన్ని ఒక వాదం మొత్తానికి ఆరోపించటం సబబుగాదు. వెయ్యి సంవత్సరాల నాటి భాషలో రాసిన కావ్యాదులకన్నా నేటి వచనరచనలు ఎన్నోరెట్లు ప్రజాసామాన్యానికి కూడా అందుబాటులో ఉన్నాయన్నది వాస్తవం. ఆధునికభాషలో పఠనపాఠనాలు జరిగినా, రచనలున్నా ప్రాచీనసాహిత్యం క్రమంగా అర్థంకావటం మానివేసి సుదూరభవిష్యత్తులో నశిస్తుందనే భయమొకటుంది. అర్థంకాక పోవటమనేది ఇప్పుడూ ఉన్నది. సాహిత్యం మీద అభిరుచిఉన్న వాళ్ళు ఎన్ని కష్టాలయినాపడి ఆదికాలంనుంచి సమకాలంవరకూ ఉన్న అన్ని రకాల రచనలూ చదువుతారు. అందరూ చదవకపోవచ్చు. అందుకు చింతించి ప్రయోజనం లేదు. ఎందుకంటే, ఒకనాడు చదువంతా సాహిత్యం, తర్కాది శాస్త్రాలూ మాత్రమే. ఇప్పుడో అశేషశాస్త్రాలు నేర్చుకోవలసివచ్చింది. శాస్త్ర విద్యాభిమానం ఉన్నవాళ్ళు తమకు ప్రత్యేకాభిరుచి ఉన్న ఏ ఒక శాస్త్రభాగాన్నో

(19)