పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికయుగం : గ్రాంథిక వ్యావహారిక వాదాలు 283

9. 18. గ్రా౦థికవాదులు చాలాకాలం నిశ్శబ్దంగా ఉండి 1958-60 లలో ఒకసారి, తిరుగా 1965-70 లలో ఒక తూరి, అప్పుడప్పుడు అక్కడక్కడ అనుకూలవాతావరణాల్లో తలఎత్తుతూ దించుతూ దోబూచులాడటం మొదలుపెట్టేరు. వాళ్లు శాస్త్రవిచారణవల్ల సాధించలేని విజయాలను రాజకీయ సాంఘికసమస్యలేవైనా అనుకూలంగా సమకూడినప్పుడు నెరవేర్చుకోదలచినట్టు నిదర్శనాలున్నాయి. 'జయంతి' పత్రికను స్థాపించిన తొలిరోజుల్లో ఈలాంటి ప్రయత్నమొకటి జరిగింది. సంపాదకులు ఒకవంక శిష్టవ్యావహారికానికి 'ప్రజామోదం' లభించిందని చెప్తూనే రెండోవైపు దుష్టప్రయోగాలతో నిండిన సారస్వతానికి ఒక 'వ్యవస్థ' కల్పించటమే తమ లక్ష్యమని ప్రకటించారు. కేవలం ఆధునికసమస్యలను చర్చించటంవల్ల ఈ శైలికి ఈ గౌరవం వచ్చిందన్నారు. (జయంతి, 1958 నవంబరు, సంపాదకీయం). 1959-60 సంవత్సరాల 'జయంతి' సంచికల్లో జువ్వాడి గౌతమరావుగారు ('వ్యవహారభాష-వ్యాకారణము' 59: మే: 'పత్రికారచన-సాహిత్యము' 60:ఫిబ్రవరి) కుల ప్రాతిపదికను తెచ్చిపెట్టేరు. వ్యావహారిక మనేది 'కృష్టాజిల్లా బ్రాహ్మణభాష' అనీ, తాముకూడా తమ ప్రాంతీయభాష ఉండగా దానికి 'దాస్యం'చేయవలసి వచ్చిందనీ వాపోయారు ! వారి ఇతరవాదాలు సరికొత్త పాతవి మరికొన్ని లేకపోలేదు. కావ్యభాషకు వ్యాకరణం రాయటమే అసాధ్యమైనవ్వుడు ప్రా౦తీయపదబంధురమైన వ్యావహారికం విషయం చెప్పనక్కరలేదని ఇప్పటి వ్యావహారిక రచనలన్నీ విజాతీయాలనీ, వీటికి ప్రచారగౌరవాలిస్తున్న పత్రీకలు బాధ్యతా రహితాలన్నీ, వ్యావహారిక వాదం ప్రాచీనకావ్యాలమీద నిరాదరణ కలిగిస్తూంది కాబట్టి ఆమోదయోగ్యం కాదనీ వారు సెలవిచ్చారు. వీరికి కొండముది శ్రీరామచంద్రమూర్తిగారూ, జలాంతళ్చంద్రచపలగారూ సవివరంగా సమాధానాలిచ్చారు. 'ఆంధ్రభాష-అవ్యవస్థ' అనే వ్యాసంలో (జయంతి, 1960 ఏప్రిల్‌) 'గాండీవి' గారు ఆకు కందని పోకకు పొందని భావాలు వెలిబుచ్చారు. శిష్ణవ్యావహారికం ప్రాచీనకవి సమ్మతంకాదని, దానికి వ్యాకరణరచన చేయనక్కరలేదని, గ్రా౦థికానికే ఒక వ్యవస్థలేదని, అందువల్ల ఏవో కొన్ని సామాన్యసూత్రాలు రాసి అందరూ ఒకేరీతి వ్యావహారికం రాయటమే మేలని వారి అభ్మిపాయం. 'ఏవోకొన్ని సూత్రాల'కోసమే ఈ ఆరాటమైతే ఆనాటికే పారనంది రామస్వామిశాస్త్రిగారు, మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు, వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు రాసిన వ్యాకరణసూత్రాలున్నవన్న సంగతి వారు స్మరించవలసింది. ఇంకా పూర్వకాలంలో రావిపాటి గురుమూర్తి