పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

282 తెలుగు భాషా చరిత్ర

ఉద్ధృతంగా వచ్చిపడ్డ, గ్రా౦థికవాదప్రవాహం ఒక్కసారిగా ఎండిపోయింది - గ్రాంథికపాఠ్యగ్రంథాలు రాగానే.

9.17. కందుకూరి వీరేశలింగంగారు,దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు, చిలుకూరి వీరభద్రరావుగారు మొదలైన విద్వాంసులు పాల్గొన్న కొవ్వూరు సారస్వత మహాసభలో (1916 నవంబరు 19) నూరేళ్ళుగా పెద్దల వాడుకలో ఉన్న పదాలన్నీ నిర్దుష్టాలన్ని, దేశవ్యాప్తంగా ఉన్న రూపాలు పూర్వప్రయోగం లేకపోయినా సాధువులేనని తీర్మానించారు. 1919 లో గిడుగువారు 'తెలుగు' పత్రికను (ఆంగ్ల భాషలో) స్థాపించి ఉద్యమం సాగిస్తూనే వచ్చారు. అంతవరకూ గ్రా౦థిక వాదానికి మూలవిరాట్టుగా ఉన్న కందుకూరివారు వ్యావహారికవాదాన్ని అంగీకరించి 'వర్తమానవ్యావహారికాంధ్రభాషాప్రవర్తకసమాజము' (1918 ఫిబ్రవరి 28) స్థాపించి దానికి అధ్యక్షులయినారు. గ్రాంథికవాదుల కిది గొడ్డలిపెట్టు. ఇది భరించలేని గ్రా౦థికవాదులు చివరకు వ్యక్తిదూషణకు దిగేరు (ఆంధ్రసాహిత్యపరిష దష్టమ సమావేశ౦-జూన్‌ 7 : వేదంవారి ప్రసంగం). కాని పరిషత్తువారు కూడా కొండదిగి 1924 అక్టోబర్‌ 13 న వ్యావహారిక భాషాబహిష్కారం రద్దుచేయక తప్పలేదు. వ్యావహారిక వాదం క్రమంగా బలపడుతూ వచ్చింది. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు సూత్రధారులుగా 1933 మార్చి 10-12 తేదిల్లో జరిగిన 'అభినవా౦ధ్ర కవి పండితసభ' బోధనభాషగా వ్యావహారికాన్ని స్వీకరించాలని తీర్మానించింది. ఆయేడు గిడుగువారు ప్రచురించిన 'గద్యచింతామణి' (ప్రథమభాగం) వచనరచనా స౦ప్రదాయాన్ని ససాక్షికంగా నిరూపించి సనాతన పండితవర్గాలకు గండికొట్టింది. 1936 లో 'నవ్యసాహిత్యపరిషత్తు' వెలిసింది. అభినవా౦ధ్రరచయితల్లో వ్యావహారికానికి అనుకూలంగా ఉన్నవాళ్ళందరూ ఇందులో చేరేరు. పరిషత్తువారు 'ప్రతిభ' అనే పత్రికను నడిపేరు. శరపరంపరంగా సమర్థకవ్యాసాలూ వ్యావహారిక రచనలూ రావటం మొదలయింది. 1937లో 'జనవాణి' అనే దినపత్రికకు సంపాదకత్వంవహించి తాపీ ధర్మారావుగారు మొట్టమొదటిసారిగా వ్యావహారికాన్ని పత్రికా భాష చేశారు. గ్రాంథిక భాష చివరకు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథాల్లో తల దాచుకోవలసి విచ్చింది. విభిన్నసాహత్యప్రకియల్లో-పద్యకావ్యాల్లో తప్ప-వ్యావహారికమే నిలిచింది. గ్రా౦థికంకూడా “సులభగ్రా౦థిక” “సరళ గ్రాంథికాది” బహురూపాలతో మునపటి సలక్షణతను పోగొట్టుకొని గతానుగతికమైన ఆప్రతిభ రచనల్లో జీవచ్చవంగా ఉండవలసిన కాలం వచ్చింది.