పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికయుగం : గ్రాంథిక వ్యావహారిక వాదాలు 281

9. 16. కాకినాడలో జూలై 1 న 'ఆంధ్రభాషా సంరక్షక' సమాజాన్ని పురాణపండ మల్లయ్యశాస్త్రిగారు కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు మొదలై నవారు స్థాపించారు. గ్రా౦థికవాదాన్ని బలపరుస్తూ 'కొత్త తెలుఁగు-మంచి తెలుఁగు ; పులుల _ దండులు-పూలదండలు' మొదలైన కరపత్రాలు ప్రచురించారు. 28-6-1914 నాటి కాకినాడ సమావేశ౦ నుంచి 23-8-1914 నాటి అన్నవరం సమావేశంవరకూ 24 బహిరంగసభల్లో న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులు, కొందరు రచయితలు గ్రా౦థికవాదాన్ని సమర్థిస్తూ ప్రసంగాలు చేశారు. ఇందులో గమనంచవలసిన విశేషాలు రెండు : గంజాం. పర్లాకిమిడి జిల్లాలలో వ్యావహారికవాదానికి బలం చేకూరగా, కృష్ణాగోదావరి జిల్లాలల్లో గ్రా౦థికానికి మద్దతు లభించింది. (2) గ్రాంథికవాదానికి అండగా నిలిచిన వారిలో ఎక్కువమంది పలుకుబడి 'కలవారే' గాని 'తెలిసిన'వారు కారు, ఈ వివాదవ్యవహారం పత్రికలకు కూడా ఎక్కింది. జూలై, ఆగష్టు నెలల ఆంధ్రపత్రిక, హిందూలలో అనేకులు మారుపేర్లతో వాదోపవాదాలు చేశారు. (చూ. Arguments for and against Modern Telugu-Scape and Co., Cocoanada). వీటీలో ఎక్కువభాగం గ్రాంథికవాదాన్ని సమర్థించేవి. ఆ వాదవిధానం తీవ్ర౦గా విచిత్రంగా ఉండేది. అందులోని ముఖ్యాంశాలివి : (1) వ్యావహారిక మనేది నింద్య గ్రామ్యం అందులో కులవృత్తి ప్రాంత భేదాలవల్ల ఏకరూపతలేదు. ఈ మాండలికాలవల్ల అది సులభంగా అర్ధంకాదు. (2) జరిగిన వెయ్యేళ్ళుగా గ్రాంథికం మారలేదు. (3) వ్యావహారికం వ్యాకరణవిరుద్ధం కాబట్టి ప్రామాణికం కాదు. (4) వ్యావహారికంవల్ల ప్రాంతీయభేదాలేర్పడి ఆంధ్రోద్యమం దెబ్బతింటుంది కాబట్టి అది పనికిరాదు. (5) ఆధునికభాషకు ప్రత్యేకంగా వ్యాకరణంగాని సాహిత్యంగాని నిఘంటువుగాని లేవు కాబట్టి అది పఠనపాఠనాలకు తగదు. (6) ఆంగ్లభాషాపరిణామంతో ఆంధ్రభాషాపరిణామాన్ని పోల్చరాదు. లిఖిత వాగ్రూపాలో తెలుగులో ఉన్న భేదాలు ఇంగ్లీషులో ఉన్నవాటికన్నా తక్కువ. (7) వెయ్యేళ్ళ క్రితమే స్థిరపడ్డ తెలుగును 'కోయ, సవర, చచ్చట' భాషలున్న కేవల వ్యవహారదశకు 'ఆటవిక స్థితి'కి దించరాదు. (8) గ్రాంథికాన్ని నీచస్థితికి దించేకన్నా వ్యావహారికాన్ని ఉచ్చస్థితికి తేవటం మంచిది. (9) వ్యావహారికాన్ని అంగీకరిస్తే ప్రాచీనసాహిత్యం అర్థం కాకుండా పోయి కాలక్రమాన నశించి పోతుంది. (10) ఆధునికభాషలో ఉన్న ఒకటి రెండు పుస్తకాలకన్నా నన్నయ భాషే సులభంగా అర్థమవుతుంది. కాబట్టే గ్రాంథికమే మంచిది. ఇంత దూకుడుగా