Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

280 తెలుగు భాషా చరిత్ర

భిన్నమైన వంటూనే, ఉభయపక్షాలవారూ రాజీవడి నవీనవ్యాకరణం రాయటం మంచిదని ఉద్బోధించారు. 'ఆంధ్రభాషాసంస్కార' మనే వ్యాసంలో పప్పు మల్లి కార్జునుడుగారు 'కొందరు' పద్యానికి గ్రాంథికమూ గద్యానికి వ్యావహారికమూ మంచిదంటున్నారని, తమ వాదాన్ని సమర్ధి౦చుకోడానికి గిడుగువారు చూపిన కావ్య ప్రయోగాలన్నిటికీ పాఠాంతరాలున్నాయని అటూఇటూ కాకుండా వాదించారు. అయితే వాదశిథిలత వచ్చినా తీవ్రత తగ్గలేదనటానికి 1914 లో జరిగిన చర్చలే తార్కాణం.

9. 15. మద్రాస్ యూనివర్శిటీ 1914 లో 'కాంపోజిషన్‌ కమిటి' అనే సంఘాన్ని నియమించింది. అందులో గ్రా౦థిక వ్యావహారిక వాదులకు మొట్టమొదట సమప్రాధాన్యం ఉండేది ; తటస్థులు కొందరుండేవాళ్ళు. ఇంటర్మీడియట్‌ పాఠ్య గ్ర౦థాలు కాదగిన పుస్తకాల పట్టిక నొకదాన్ని జి. వెంకటరావుగారు సమర్పించారు. వాటిలోని పదజాలాన్ని ప్రాచీనార్వాచీనాలుగా విభజించి అర్వాచీనా లనే ఆమోదించాలని మొదట నిర్ణయించారు. అయితే ఆ శబ్దాల నిర్ణయం దగ్గర పేచీవచ్చింది. ఇంతలో ప్రాంతీయ ప్రాతినిధ్యం సరిగాలేదని అందోళనచేసి గ్రా౦థికవాదులు మరియిద్దరు తమ వారిని చేర్చగలగటంతో సంఖ్యాబలం వారివైపు మొగ్గింది. కొమ్మరాజు లక్ష్మణరావుగారు A Memorandum of Telugu Prose అనే వ్యాసంలో గ్రాంథికవాదం చేశారు. గురజాడవారు తమ వ్యతిరేకతను సోపపత్తి కంగా సుడీర్చ వ్యాసరూపంలో (The Minute of Dissent to the Report of the Telugu Composition Sub-Committee : MD) ఆంగ్ల భాషలో చర్చించగా మరి ముగ్గురుసభ్యులు సంతకాలు చేశారు. వ్యావహారిక రచనా స౦ప్రదాయం మనకు శతాబ్దాలుగా ఉన్నదని రుజువుచేస్తూ గిడుగువారు 'నిజమైన సంప్రదాయం' మనే చిన్నపుస్తకం రాశారు. వ్యావహారికవాదులు ఎలమంచిలిలో జరిపిన విద్వత్సభలో శిష్షవ్యావహారికం గ్రామ్యం కాదనే వరుల చినసీతారామస్వామిగారి తీర్మానం నెగ్గింది. పర్లాకిమిడి కళాశాలలో ఆగష్టు 3 న బి. మల్లయ్య శాస్త్రిగారి అధ్యక్షతన జరిగిన ఆ౦ధ్రసారస్వతపరిషత్తు వార్షికోత్సవసమావేశ౦లోనూ వ్యావహారిక వాదాన్ని సమర్థించటం జరిగింది.చారిత్రకదృక్పథంతో భాషాపరిశీలన జరగాలని, పఠనపాఠనాలు ఆధునికభాషలోనే జరగాలని నారాయణ మూర్తిగారు ఉపన్యసించారు.