ఆధునికయుగం : గ్రా౦థిక వ్యావహారిక వాదాలు 279
'గ్రామ్యవాదులు' వాడే “internal sandhi, liaision” అనే మాటలకు వారు చెప్పిన అర్థం, చేసిన వివరణాత్మకవిమర్శన చదివి ఆనందించదగ్గవి.
9. 14 గ్రాంథికవాదుల్లో చాలామంది జయంతి రామయ్యగారి లాగానే చాలావరకు ఉన్నతోద్యోగాల్లో ఉన్నవాళ్ళే. వాళ్ళ ఒత్తిడి ఎక్కువై మద్రాసు ప్రభుత్వం వ్యావహారికోపయోగాన్ని మరింత సంకుచితపరుస్తూ 1913 జనవరి 10 న (జి. ఒ. 20) మరో ఉత్తరువు జారీచేసింది. ఒక పాఠశాలలోని విద్యార్థులు గ్రాంథికవ్యావహారికాల్లో దేని వైపు మొగ్గచూపితే ఆ శైలినే మొత్తం పాఠశాల అంగీకరించినట్లు భావించి సమాధానపత్రాల మీద గుర్తు పెట్టాలని ఆ ఉత్తరువు నిర్ణయించింది. అంటే ప్రధానోపాధ్యాయుల అభిప్రాయాలు చెల్లుబడికి వస్తాయన్న మాట. చివరకు సంన్కరణ నేతిబీరకాయగా పరిణమించింది. గ్రాంథికవాదులకు ఇది ఘనవిజయం. ఇందుకు ప్రత్యుత్తరంగా గిడుగు వేంకట రామమూర్తిగారు ఇంగ్లీషులో 'A Memorandum on Modern Telugu' అనే కరపత్రాన్ని ప్రచురించారు. దానికి ప్రతిగా జయంతి రామయ్యగారు 'A Defence of Literary Telugu' అనే కరపత్రాన్ని ప్రకటించాంరు. గిడుగు వేంకటసీతాపతిగారి 'సొడ్డు', గురజాడ అప్పారావుగారు మద్రాసు విశ్వవిద్యాలయానికి ఇచ్చిన 'ఆధునికాంధ్ర వచన రచన' అనే నివేదిక వ్యావహారికవాదానికి సహాయకారులు కాగా, పానుగంటివారి 'గ్రామ్యవాద విమర్శనము', పురాణపండ మల్లయ్యశాస్త్రిగారి 'ఆంధ్ర భాషా సంస్కరణ విమర్శనము', మల్లాది సూర్యనారాణశాస్త్రిగారి 'గ్రామ్యమా ? గ్రా౦థకమా ?' అనే వ్యాసము, పి. సూరిశాస్త్రిగారు సంకలనం చేసిన 'The Grahmya Controversy అనేవి గ్రా౦థికవాదానికి తోడ్పడేవి. ఆంధ్రసాహిత్య పరిషత్తు తృతీయ వార్షికోత్సవ సందర్భంలో గ్రాంథికవ్యావహారిక వివాదంలో పరిషదభిప్రాయాన్ని నిరూపించవలసివచ్చింది. అంతకుముందు నియమించిన ఉపసంఘ నివేదిక అప్పటికి అందలేదు. కాబట్టి నిర్ణయం వాయిదా వేయమని గిడుగు గురజాడలు వాదించినా సంఖ్యాబలప్రాతిపదికమీద 1912 మే నాటి పండిత గోష్టి ఆభిప్రాయమే పరిషదభిప్రాయమనే నిర్ణయం జరిగింది. దీంతో ఈ వివాదాన్ని సభాముఖంగా పత్రికాముఖంగా పరిష్కరించుకోవాలన్న అభిలాష ఉభయపక్షాలకూ కలిగింది. కాని అప్పటికే కొందరు గ్రాంథిక వాదంలో శిథిలత ప్రవేశించింది. నండూరి మూర్తిరాజుగారు 'గ్రామ్యవాద విమర్శన' మనే వ్యాసంలో వ్యావహారికవాదుల 'ధ్వనిశాస్త్రమూ' గ్రాంథికవాదుల 'వ్యాకరణమూ'