Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

276 తెలుగు భాషా చరిత్ర

అశక్తసహాయం చేసింది. విశాఖ కళాశాలాధ్యక్షులు పి. టి. శ్రీనివాసయ్యంగారి 'Indian Practical Arithmetic' (1911), వీరి పీఠికతో ఆయేడే వెలువడ్డ వేదం వేంకటాచలమయ్యగారి 'విధి లేక వైద్యుడు' అనే పుస్తకమూ అలాంటి రచనలే. శ్రీనివాసయ్యంగారి 'Life of Death- A Plea for Vernaculars' అనే కరపత్రం గ్రాంధికాన్ని తీవ్రంగా నిరసించి సనాతన పండితులను బాగా రెచ్చ కొట్టింది. పై సిద్ధాంతాలను ప్రచారం చేయటానికి విజయనగరంలో ' ఆంధ్ర సారస్వత సంఘాన్ని' నెలకొల్పేరు. విజయనగర కళాశాలాధ్యక్షులు కిళా౦బి రామానుజాచార్యులుగారు దీనికి అధ్యక్షులు, బుర్రా శేషగిరిరావుగారు కార్యదర్శులు. కొన్ని సంవత్సరాలుగా వాడుకలోఉన్న భాషలోనే గ్రంథరచన చేయాలని, శిష్టవ్యహారభాషే నేటి ప్రామాణికభాష కాబట్టీ పఠన పాఠనాలు అందులోనే జరగాలని పై సంఘంవారు తీర్మానించారు.

పై సిద్ధాంతాలవల్ల భాషాసాహిత్యాలు అవ్యవస్థలో పడిపోతాయని, వ్యావహారికమనేది గ్రామ్యమేనని, నమ్మినవారు జయంతి రామయ్యగారి ఆధ్వర్యాన కాకినొాడలో 'ఆంధసాహిత్యపరిషత్తు' (Telugu Academy) స్థాపించారు. ఆనాటి పెద్ధపండితులు వేదం వేంకటరాయశాస్త్రి, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారలూ తదితరులూ ఈ సంఘంలో సభ్యులు. ఆశయ్యప్రచారానికి 'ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక' ను ప్రచురించారు. (వాసుదాసుగారు 'ఆధునిక వచనరచనావిమర్శన' మనే పుస్తకంలో వ్యాకరణరీత్యా వ్యావహారికం గ్రామ్య మేనని తీర్మానించారు). ఈ సంఘంలో గిడుగు, గురజాడలు కూడా సభ్యులై నారు. మద్రాసు పచ్చయప్ప కళాకాలలో వీరు జరిపిన ప్రథమ సాంవత్సరికసభలో శతఘంటము వేంకటరంగశాస్త్రిగారు గ్రామ్యాన్ని సమర్థిస్తూ ప్రసంగిస్తే, గిడుగువారు 'ఆంధ్రభాషాచరిత్ర'అనే వ్యాసం చదివి శిష్టవ్యావహారికాన్ని సమర్థించారు. ఈ వివాదంమీద అనేకులను ఆహ్వానించి గోష్టి ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం జరిగింది. ఆ తరవాత పరిషత్తువారు నవంబర్‌ 24న కందుకూరి వీరేశలింగంగారి అధ్యక్షతన 'గ్రామ్యాదేశనిరసనసభ' జరిపేరు. అధ్యక్షులవారు భాష 'నాగరభాష, గ్రామ్య' మని రెండువిధాలని, మొదటిది సంస్కృతంలాగా పరిష్కృతం కాబట్టి కావ్యరచనకు పూర్ణంగా ఫనికివస్తుందని, రెండోది పామరవినోదార్థం పాత్రోచితభాషగా అక్కడక్కడ వాడదగిందని సెలవిచ్చారు. పూర్వకాలపు తెలుగువ్యాకరణాలు ముఖ్యంగా కావ్యాలకోసం ఉద్దేశింపబడ్డాయని, గద్యానికి