272 తెలుగు భాషా చరిత్ర
9.7. పాశ్చాత్యవిద్వాంసుల్లో పరిపాలకుల్లో కొందరు సంస్థృతాంద్రాలను, ద్రవిడభాషలనూ నేర్చి గ్రంథరచన సాగించటంతో నూతనసాహితీ ప్రకియలతో బాటు నూతన రచనాధోరణులు గూడా తెలుగువారికి పట్టుపడ్డాయి. కర్నల్ కాలిన్ మెకంజీ (1753-1821) అనే ప్రభుత్వోద్యోగి కావలి వెంకటబొర్రయ్య (1776-1803) గారనే విద్వాంనుడి సహాయంతో బహువ్యయప్రయాసలు పడి సేకరించిన 'కై ఫీయతులు' మనవాళ్ళకు తొలిసారిగా చారిత్రక దృక్పథం ప్రసాదించాయి. వీటన్నిటినీ పునారచింపజేసి ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 62 సంపుటాల స్థానికచరిత్రలను సిద్ధపరిచాడు. 1816లో కాంబెల్, 1817లో బ్రౌన్ తెలుగుభాషకు నవీనపద్ధతిలో వ్యాకరణాలు రాశాడు. 1820 లో 'ఉపయుక్త గ్రంథకరణ దేశ భాషాసభ ఏర్పడి తెలుగులో అప్పటికి పెద్దలోటుగాఉన్న వచనరచనకు పాఠ్యగ్రంథనిర్మాణానికి నడుంకట్టింది. 1840 లో బ్రౌన్ తెలుగువచనంలో రాసిన తెలుగువ్యాకరణం వెలువడింది. అతని తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు 1852లోను, బ్రౌణ్య మిశ్రభాషానిఘంటువు 1854 లోను వెలుగుచూశాయి. 1855-66 లో రాబర్డ్ కాల్డ్ వెల్ రాసిన ద్రవిడభాషా తులనాత్మక వ్యాకరణం శతాబ్దాలుగా భాషావిషయంలో తెలుగు విద్వాంసులకున్న దురభిప్రాయాలను కొంతవరకయినా పోగొట్టింది. భాషలు మారతాయని, మార్పు చెడిపోవటం కాదని, 'సకల భాషలకును' సంస్కృతం 'జనని' కాదని ఈ వ్యాకరణం ప్రతిపాదించింది.
9.8. పాఠ్యప్రణాళికలో వచ్చిన మార్చులవల్ల విద్యావిధానంలో కూడా మార్చు వచ్చింది. అంతవరకూ పంచకావ్యాలకూ తర్కవ్యాకరణాదులకూ పరిమితమైన విజ్ఞానబోధలో చరిత్ర, భూగోళం, ప్రకృతి భౌతిక శాస్త్రాలు, విభిన్న సారస్వత ప్రక్రియలూ చోటుచేసుకున్నాయి. గురుమూర్తిశాస్త్రిగారి 'విక్రమార్కుని కథలు' (1819), 'పంచతంత్ర కథలు' (1934), ఏనుగుల వీరాస్వామయ్య గారి 'కాళీ యాత్రాచరిత్ర' (1838), మామిడి వెంకయ్యగారి 'ఆంధ్ర దీపిక' (రచన 1816, ప్రచురణ 1848), బ్రౌన్ బైబిల్ అనువాదము (1827), ఆర్జెన్ తెలుగు వ్యాకరణము (1873), జార్జి బీర్ 'ప్రపంచభూగోళము' (185), గురుమూర్తిసాస్త్రి గారి తెలుగువ్యాకరణము (1836) మొదలైనవి పాఠ్యగ్రంథాలుగా ఉండేవి. 1848 లో పరవస్తు చిన్నయసూరిగారు 'ఉపయుక్త గ్రంథకరణ దేశభాషాసభ'కు అధ్యక్షులయ్యేటంతవరకు పాఠ్యగ్రంథాల్లో వ్యాకరణ రచనల్లో అనాటి శిష్టవ్యావహారికమే వాడుకలో ఉండేది. ఆయన 1853 లో 'నీతిచంద్రికను'ను, 1855 లో