Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకరణం 9

ఆధునికయుగం : గ్రాంథిక వ్యావహారిక వాదాలు (క్రీ. శ. 1900 నుంచి నేటివరకు)

- బూదరాజు రాధాకృష్ణ

9.0. నన్నయకు పూర్వంనుంచీ దేనికదిగా మారుతూ వచ్చిన కావ్య వ్యవహార భాషాభేదాలు రెండూ ఇరవయ్యో శతాబ్దం అరంభంలో తీవ్ర వాదోప వాదాలకు దారితీశాయి. పూర్వ కావ్యభాష మారదనీ దాన్ని మార్చగూడదనీ ఒక వర్గమూ, శిష్టవ్యవహారంలో ఉన్న భాషారూపాన్నే గ్రంథరచనలో ఉపయోగించాలని మరో వర్గమూ వాదించటంతో కవిపండితలోకం రెండుగా చీలిపోయింది. ఈ వాదోపవాదాలకు ప్రధానకారణం ఇరవయ్యో శతాబ్దింనాటి ప్రత్యేకపరిస్థితే.

9.1. నన్నయ కాలానికీ నాయకరాజుల కాలానికీ మధ్య కావ్యరచన వినా మరో సాహితీ ప్రక్రియకు పండిత లోకంలో గౌరవం ఉండేదికాదు. అవి పురాణాలయినా ప్రబంధాలయినా శతకాలయినా వాటి ప్రయోజనం కావ్యానందం కలిగించటమే. తర్కవ్యాకారణాది శాస్త్రాలను రచించేటప్పుడు కూడా పద్యరచనకే మన కవులు ప్రాముఖ్య మిచ్చారు. సంస్కృత నాటకాలనుకూడా పద్యకావ్యాలు గానే అనువదించారు. కవులమీద లాక్షణికుల ప్రభావం విపరీతంగా ఉండేది. వచనరచనలు, యక్షగానాదులు నాయకరాజుల కాలంలో పెద్దయెత్తున రావటంతో లాక్షణికప్రభావం తగ్గుతూ వచ్చింది. ఫలితంగా నన్నయనాటి భాషలోనే రాయాలన్న పట్టుదల సడలిపోయింది. ఆ కాలంలోనే ఆంగ్లేయ పరిపాలన దేశంలో మొధలై, క్రమక్రమంగా వేరుదన్ని నిలదొక్కుకోవటంతో, ఆంగ్లభాషద్వారా విశ్వసాపితీ స్వరూపం తెలుగు వారికి తెలియరావటంతో, విద్యాధికుల దృక్సఖాల్లో రాజకీయ సామాజిక జీవితవిధానాల్లో మార్చు వచ్చింది. ఇరవయ్యో