264 తెలుగు భాషా చరిత్ర
ఎరుకు, సర్కు = సరుకు, గురు = గురుకు, ఉర్కు = ఉరుకు (కా. మ.వ. II 108), పొర్లు = పొరలు (పై. V 102), పర్వుతేరి = పరువు (సు. మా. చం. IV 86), ఉండ్రి = ఉండిరి, ముచ్చటలాడుచుండ్రో (గో. కూ. సిం. పద్యం. 22) కొల్ను = కొలను. తామరకొల్నురీతి (రె. మ. గం. II 146).
(త) లోపదీర్ఘత : (Compensatory Lengthening): ఉచ్చారణంలో ఒక అక్షరం లోపించి ఆ విధంగా లోపించినందున కలిగే హ్రస్వత పోవటానికి పక్కఅచ్చు దీర్ఘంకావటం. ఉదా : బైట = బయట (కం. పా. ఉ. I 20).
(ప) ద్విరుక్తహల్లుకు మారుగా అద్విరుక్తహల్లు : ఎట్టయిన గానిము = కానిమ్ము (అ. కా. I 238), బంగరుగినెలై = గిన్నెలై (ర. ఘ. గం. IV 28).
(గ) అద్విరుక్తహల్లుకుమారుగాద్విరుక్తహల్లు : అనతియియ్యగ నూర కుండరాదే (కం. పా. ఉ. II 189), చెయ్యియ్యదాయెగా (లిం. శ్రీ. స. IV 151), ఇయ్యగవలసెన్ (కా. మ. ష. III 79), చెంతకుఁ దియ్యంగఁజే విదుల్చు (ప.రం.మ. V 105), వచ్చుచుఁబొయ్యేటి వరసవారికి (అ. నా. హం. IV 162), పెనుతలపు గడియదీయ్యని (పైది. III 93) , నా కియ్యమనిన (పైది. V 73), చూపియ్యడు (కూ. జ. చం. II 69).
8.37. అన్యదేశ్యాలు : ప్రాణవంతమ్తైన ప్రతిభాషా అవసరం కొలది అన్యదేశ్యాలను ఎరవు తెచ్చుకొంటద్ది. వాణిజ్య వ్యాపారాల మూలంగా, సాంఘికమైన అవసరాల మూలంగా, సంస్కృతీ ప్రభావం మూలంగా, పరిపాలనమూలంగా భాషలలో ఇటువంటి ఆదాన ప్రదానాలు జరుగుతవి. ఒకప్పుడు ఈ యెరువు మాటలు, తెచ్చుకొన్నావాళ్ల భాషకు అలంకారాలై తుష్టినీ, పుష్టినీ కూర్చుతవి. మరొకప్పుడు ఈ ఎరువు సొమ్ములు బరువుచేటులై పోతవి. సంస్కృత ప్రాక్సృత శబ్దాలెన్నో తెలుగుభాషలో చేరిపోయి తెలుగులై పోయినవి. ముస్లింల ప్రభావంతో తెలుగులో అరబీ, ఫార్సీ పదాలు చాలా చేరిపోయినవి. ఈ విదేశీ భాషాపదాలు శ్రీనాథుని కాలంనుండే ఎక్కువసంఖ్యలో తెలుగులోనికి రావటం మొదలు పెట్టినవి. ఈ యుగంలో వర్ధిల్లిన కవులు కూడా ఇటువంటి అన్యదేశ్యాలను చాలా వాడినారు. ఉదా.
పంచదారనుదిను బాబానజీరు (వి. నా. ర. పుట 45)
కుళ్ళాయిపైఁబాగ కుదురుగాజుట్టి (పై. పుట. 51)