Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్యభాషా పరిణూమం 259

8.26. అతిశయమూ ఆథిక్యమూ చెప్పే సందర్భంలోకూడా ఇటువంటి దీర్ఘమే వస్తుంది. ఉదా: మిగులా నుప్పొంగెడిన్‌ (లిం. శ్రీ. స. III 55), చాలా నచ్చరల్‌ మెచ్చగన్‌ (లిం. శ్రీ. స. I 126), చాలా వంచకుడు (లిం. శ్రీ. స. IV 174), పొగరుచూపులతోఁబడాపగలఁజూచె. కప్పుగొప్ప బడాపగలజూడనిఘనుండు (అ. నా. హం. II 31, 146).

పూరణార్థకమైన-'అవ'కు మారుగా 'ఒ'అనే వ్యవవార సిద్ధరూపం కూడ నాటి గ్రంథాలలో ప్రవేశించినది. ఉదా. పందొమ్మిదో ఛందమునను (కా. అ. అ.పుట. 287).

8.27. స్త్రీజనవ్యవహారంలో వినిపించే వినే (= వినవే) అనే క్రియారూపం కూడ (స. వెం. రా. I 69) కావ్యభాషలో చేరిపోయినది. అదేవిధంగా సంభాషణలో జరిగే పురుష, వచన, కాలవ్యత్యయాలు కూడ ఆనాటి కావ్యాలలో ఉన్నవి. పురుషవ్యత్యయ. 'మీరెవ్వరు మేమెవ్వరు' (ర. భూ. వా. II 122). మేమెన్వరము అనవలసినచోట మేమెవ్వరు అన్నాడు. వచనవ్యత్యయం. 'ఈరసమే దోషుల్‌' (ఎ. బా. మ. పద్యం, 17). ఇందులో ఈరసము ఏకవచనం. దాని విశేషణమైన దోషుల్‌ బహువచనంలో ఉన్నది. కాలవ్యత్యయం. "చూచెదనని వచ్చినాను సుదతీ నిన్నున్‌” (పా. క. శు. I 83). ఇందులో భూతానికి వర్తమాన రూపం వాడినాడు.

8.28. “యకారంబును వువూ వొవోలును దెలుఁగుమాటలకు మొదట లేవు” (సంజ్ఞా-17) అని చిన్నయనూరిగారన్నా ప్రాచీన తాళపత్రగ్రంథాలలో ఇవి కొల్లలుగా కనుపిస్తున్నవి. వ్యవహారంలోను వినుపిస్తున్నవి. ఈయుగపు కావ్యాలలో కూడ ఇవి ఉన్నవి. ఉదా: తొట్లవూచి (పా. క. శు. IV. 285) 'ఉపరతి సేయనా వోరి జాణ" (ప.రం.ఉ. II 44).

8.29. ఎకార విశిష్టంగా ఉండవలసినమాటలు అకార విశిష్టంగా ఉండటం వ్యావహారికభాషాలక్షణం. ఇవి లాక్షణిక సమ్మతాలు కావు. కాని ఈ యుగపు కవులు వీటిని భాహాటంగా ప్రయోగించినారు. ఇందులో నామవాచకాలు క్రియలు ఉన్నవి. ఉదా: 'చఱకగు వింటి బల్మి" (అ. కా. III 86), చన్నయాచార్యు డాచార్య చక్రవర్తి (అ. వెం. గో. I 27), చాటంతమబ్బుదోఁచె (పా. క.శు. IV 124), చాయన్వలే (చిం. చా. రా. V 260), తటవాయ (ప.రం. ఉ. II 87),