Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

254 తెలుగు భాషా చరిత్ర

8.14. యడాగమాలు : లాక్షణికులు అంగీకరించనివీ, వ్యవహారంలో ఎక్కువగా వాడేవీ ఐన యడాగమాలు కూడ నాటి కావ్యభాషలో కనువిస్తున్నవి. ఉదా. మదిరాక్షి బదులుకు బదులు యనుచు (స.వెం.రా. I 18), ఆనతియియ్యగ (కం.పా.ఉ.II 189).

'కర్మధారయంబులందు మువర్ణకంబునకుం బుంపులగు' (సంధి. 32) అని చిన్నయసూరిగారి అనుశాసనం. దీనికి విరుద్ధంగా కర్మధారయంలో మువర్ణకానికి పుంప్వాదేశం జరుగని ప్రయోగాలు నాటి కావ్యభాషలో లభిస్తున్నవి. ఉదా. 'బొక్కసమిండ్లు' (క. వ రా. vol. II పుట, 151), 'బాదం పలుకులు' (అ. నా. హం.I 105).

'కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమంబగు' (సంధి. 28) అని సూరిగారి మతం. దీనికి భిన్నంగా టుగాగమం జరుగవలసిన చోట జరుగని రూపాలు కూడ నాటి కవులు వాడినారు. ఉదా : 'పనసాకుపందిరి' (అ. నా. హం. I 151). 'కాపురవింటి లోపలికి' (కూ. జ. చం. II 127), 'పసరంపెమ్ము' (ఎ. బా. మ. పద్యం 22).

సమాసాలు :

8.15. వ్యహారంలో బహుళంగా ఉండి కావ్యభాషలో నిషిద్ధమైన వైరి సమాసాలు కూడ ఈ యుగపు కావ్యాలలో కొన్ని కనుపిస్తున్నవి. ఉదా : 'శూద్ర బిడ్డ' (అ. నా. హం. V. 124), 'బీగముద్రలు' (ప. రం. ఉ. II 97), 'మూల బొక్కసంబు' (స. వెం. అ. II 52), 'వీటీ సంబళులు' (చిం.చా.రా.II 249), 'చిక్కణ భాగముల్‌” (చిం. చా. రా. VI 295).

క్రియాపధాలు :

8.16. వ్యవహారబలం వలన కావ్యభావలో చేరిన క్రియారూపాలు రెండు విధాలు. (1) శిష్టవ్యవహార సాధారణరూపాలు (2) మాండలిక వ్యవహారసిద్ధాలు. ఇందులోనే లాక్షణికులు గ్రామ్యాలనీ కవులు పామరభాష అనీ పాత్రోచిత భాష అనీ ప్రయోగించినవి చేరుతవి.

8.17. వర్తమాన క్రియలు : 'మిసమిస మెఱచుచు లోపల' (ర. భూ.రా. I 101). ఇందులోని 'మెఱయు' ఛాతుపర్యాయ రూపం 'మెఱచు' దక్షి