Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

252 తెలుగు భాషా చరిత్ర


(16) -ఇ + ఒ-> ఒ- :-

తాల్చి + ఒగిన్‌ = తాల్చొగిన్‌ (అ. నా. హం. V 88)

ప్రణుతి + ఒనర్చి = ప్రణుతొనర్చి (అ. వెం. గో.I 12)

గణుతి + ఒనర్చ = గణుతొనర్చ (అ. వెం. గో. I 38)

(17) -ఉ + అ- > అ- :-

మిన్నుముట్టుచు + అహంకరించు - మిన్ను ముట్టు చహంకరించు (చే. వెం. వి. III 64)

అగుచు + అర్ధశ్రేణి = అగుచర్థశ్రేణి (ఎ. బా. మ. పద్యం. 36)

పిల్చుచు + అహల్యా = పిల్చుచహల్యా (స.వెం. అ.III 134)

అతిశయిల్లుచు + అవని = అతిశయిల్లచవని (చి.సిం.బి.I 46)

ఇందులో యడాగమం చేసిన ఉదాహరణం కూడ ఒకటి లభించినది.

'మదిరాక్షి బదులుకు బదులు యనుచు' (స.వెం.రా.I 18)

(18) -ఉ + అ- > అ- :-

మించు + అగు = మించాగు (చే.వెం.వి. II 73)

(19) -ఉ + ఇ-> ఇ- :-

దువ్వుచు + ఇట్లను = దువ్వుచిట్లను (అ.కా. I 286)

పగలు + ఇనుండు = పగలినుండు (కా.మ.ష. II 62)

(20) -ఉ + ఈ- > ఈ- :-

పల్కుమంచు + ఈ సమాచారంబు = పల్కుమంచీ సమాచారంబు (స.వెం. అ. I 50)

(21) -ఉ + ఎ-> ఎ- :-

పైయెత్తు + ఎన్నకే = పైయెత్తెన్నకే (చే.వెం.వి. III 163)

కల్గు + ఎనుబోతువు = కల్గెనుబోతువు (అ.నా.హం. V 38)