Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్యభాషా పరిణామం 247

8.10. సంప్రదాయ వ్యాకరణం ప్రకారంగా ఔపవిభక్తికాలైన వాటిని అనౌపవిభక్తికాలుగాను, అనౌపవిభక్తికాలను ఔపవిభక్తికాలుగాను నాటి కవులు ప్రయోగించినారు. దీనికి కవుల భ్రమప్రమాదాలే కాక నాటి వ్యవహారబలం కూడ కారణమై ఉండవచ్చును.

ఔపవిభక్తికాలు అనౌపవిభక్తికాలుగా :-

ఉదా : చేరంజని మఱుననాడు ( = మఱుసటినాడు) (అ.నా.హం. VI.202) నొసల మేల్సొగసులీల ( =నొసట) (కూ. తి. ర. I. 84) పదములెగయంగ వర్ణముల్మొదలికేగ (మొదటి)(కా.మ. ప.III. 45).

అనౌప విభక్తికాలు ఔప విభక్తికాలుగా :-

అవని చెంగట నామటిమేర (ఆమడ) (క. వ. రా. Vol. II.పుట. 35) పోలుగ వాతాపి పొట్టేటిఁజేసి (పొట్టేలు) (క. వ. రా. Vol. II. పుట. 37) అడుగిటి లోనబట్టు (అడుగులోన) (కా. మ. ష. II 66) నేతిడి నెఱ్ఱగా వేఁచిన వేఁపుడు (నేయిడి) (కా. మూ. పాం. IV.4) పనసపంటికి మంచి పసయోడఁ గూర్పక (పండుకు) (కూ.తి.న. III 40)

సంధి

8.11. త్వరిత సంభాషణలో వినిపించే అచ్సంధులూ హల్సంధులూ నాటి కావ్యభాషలో చాలా ఉన్నవి. వీటిలో లాక్షణికులు అంగీకరించని తత్సమాచ్సంధులూ, శృతర్థకసంధులూ, ద్రుతప్రకృతిక సంధులూ, క్త్వార్ధక సంధులూ ఉన్నవి. ఒక్కొకచోట తత్సమ శబ్దాలకు తెలుగుపద్ధతిలో సంధిచేసిన ఉదాహరణలు కూడా ఉన్నవి. లాక్షణికులు అంగీకరించని ఈ సంధులు చేసినవాళ్ళంతా సాధారణ కవులుకారు. కొందరు లాక్షణికులనిపించుకొన్నవారు మరికొందరు మహా కవులు అనిపించుకొన్నవారు కూడ ఇందులో ఉన్నారు.

8.12. అచ్సంధులు (1) - అ + అ-అ > - :- ఒక + అక్షర = ఒకక్షర. ఒకక్షరమైనను రాదు (పా. క. శు. II 438)