242 తెలుగు భాషా చరిత్ర
పోగా తరువాతి తరాలవారు మాత్రమే వాటితో సామ్య౦కల మన వర్ణాలను ఉచ్చరించినట్లు పలుకుతున్నారేకాని ఆయా విదేశీ భాషలను ఎరిగినవాళ్ళు ఉన్న దినాలలో వాటి మౌలికత ఉచ్చారణలో చెడిపోకుండా ఉండేదని మనం భావింపవచ్చు.
f (ڦ) వర్ణాన్ని ఈ యుగపు కవులు 'ఫ'తో గుర్తించినారు. ఇది దంత్యోష్ట్యమూ నాదవిరహితమూ ఐన ఊష్మ౦. తేలుగుకవులు మాత్రం దీనికి మారుగా ఓష్ట్యమూ నాదవిరహితమూ మహాప్రాణమూ ఐన స్పర్శం వాడినారు. ఉదా: జాఫరాజినుఁగు లేపునజెందు (అ. నా. హం. I. 240), కొలఁకు జక్కన ఫౌఁజు లెలసిరే య (కూ. తి. ర. III, 94), ఫిరంగీలు (స. వెం. అ. II. 95) మొదలైనవి.
x (ڂ) వర్ణాన్ని మనకవులు క, ఖ లతో సూచించినారు. ఇది కంఠ్యమూ నాదవిరహితమూ ఐన ఊష్మం. మనవాళ్ళు మాత్రం దీనికి మారుగా నాదవిరహితమైన మహాప్రాణ కంఠ్య స్పర్శాన్ని అల్పప్రాణ స్పర్శాన్ని ఉపయోగించినారు. అన్యదేశ్యాలలో ఈ ధ్వనిగలవి వ్రాతలో (ڂ) (ڧ) రెండు వర్ణాలన్నవి. అరబీ, ఫార్సీ మాతృభాషగా కలవాళ్ళు ఈ రెంటినీ వేరువేరుగా ఉచ్చరిస్తారేమో కాని మన దేశ౦లో ఉర్దూ మాతృభాషగా కలిగిన ముస్లి౦లు మాత్రం వ్రాతలో వేరువేరుగా గుర్తించినా ఉచ్చారణలో మాత్రం ఒకే విధంగా ఉచ్చరిస్తారు. మన పండితులు శకటరేఫను సాధురేఫను వేరువేరుగా వ్రాసి ఉచ్చారణలో భేదం పాటించనట్లే పై వర్దాలగురించి ముస్లింలు ఉర్దూభాషాపండితులు వ్రాతలో భేదం పాటించి ఉచ్చారణలో భేదం పాటించటంలేదు. ఈ ధ్వనులుగల అన్యదేశ్యపదాలను ఈ కాలపు కవులు చాలా వాడినారు. ఉదా. జాపత్రియను గురాసాని యోమంబు (వి. నా. రా. పుట. 57). ఇందులో ద్రుతం మూలంగా కు, గు గా మారింది. జమా ఖరుచుల్ గణించి (అ. నా. హం. I 142), కలయఁగ ఖుశాలు వచ్చు (అ. నా. హం. V. 182). ఖుశాలు పదంలోని శవర్ణానికి మారుగా షవర్ణం వాడవలసి ఉండె. మౌలికంగా అది మూర్దన్యమైన ఊష్మం. ఖరుచుసేయుచు (లిం. శ్రీ. స. I 104), బందిఖానా (లిం.శ్రీ.స. IV 118), ఖబురు (లిం.శ్రీ.స.IV. 14) ఇదే మాటను ఈ కవే మరొకచోట ప్రాసకోసం కపురు (IV. 180) గా వాడినాడు. నకసీపని (లిం. శ్రీ. స. I. 30), నకాసిగుడారు (లిం. శ్రీ. స. III 4) అన్నప్పుడు కూడా 'క' వర్ణమే వాడినాడు.
y (ݟ) వర్ణాన్ని మన కవులు 'గ' తో సూచించినారు. ఇది నాదాత్మకమైన కంఠ్యోష్మము. కాని మనవాళ్ళు నాదాత్మకమైన కంఠ్య స్పర్శంగా ఉచ్చరిస్తున్నారు.