పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

240 తెలుగు భాషా చరిత్ర

ఉన్నారు. కాబట్టి వారి రచనలలో ఆయా ప్రాంతాల మాండలికాలు యాసలు చోటు చేసుకొన్నవి. ఈ కాలపు రచయితలు లాక్షణికులుగానీ, కేవలం కవులుగానీ తమ తమ రచనలలో గ్రామ్యమనీ పాత్రోచితభాష అనీ ఆనాటి శిష్టవ్యావహారీకాన్ని శిష్టేతర వ్యావహారికాన్ని ప్రయోగించినారు. ఇందువల్ల మనకు ఆనాటి వాడుకభాష ఎట్లాఉండేదో కొంత మచ్చుకైనా తెలుస్తుంది. ఆయా కవులు వాడిన అన్యదేశ్య పదాలలో మన భాషలోలేని వర్ణాలు కొన్ని కనుపడుతవి. ఆయా అన్యదేశ్య వర్ణాలకు సన్నిహితంగా ఉండే మన వర్ణాలనే వాళ్ళు వాడినారు. మరి ఆనాటి ఉచ్చారణ ఏ విధంగా ఉండేదో మనం ఊహించలేము.

వర్ణసమామ్నాయం

8.1. వర్ణాలలో అచ్చులకు సంబంధించినంత వరకు అ ఆలకు ఎ ఏ లకు నడిమి ఉచ్చారణం కలిగిన అ ఆ లు ఉన్నట్లు ప్రయోగాలవల్ల తెలుస్తున్నది. ఐతే వీటికి ప్రత్యేక వర్ణాలగుర్తులు మాత్రం మన వర్ణసమామ్నాయంలో కల్పించుకోవటం జరుగలేదు. ఇత్తునకు హ్రస్వ అకారంతో సంధిచేసినప్పుడు హ్రస్వ అకారము, దీర్ఘ అకారంతో సంధిచేసినప్పుడు దీర్ఘ అకారము వినబడుతవి. ఊదా : బంతి + అనున్‌ = బంతనున్‌ (చే. వెం. వి. I.102), అనవలసి + అంటి = అనవలనంటి (చే. వెం వి I 161), ఒసంగి + అని= ఒసంగని (చిం. ఛా రా. IV. 9), క్రుంకి + అడిగ = క్రుంకడిగె (పా. క. శు. II. 235), నాగవల్లి + అట = నాగవల్లట (పా. క. శు. II.168), ఇన్ని + అని = ఇన్నని (కా.మ.ష II.8), సవతి + అని = సవతని (అ. కా.I 203), సారథికుంటి + అని = సారథకుంటని (చి. సిం. బి.) కన్నతల్లి + అడిగిన = కన్నతల్లడిగిన (ప. రం. ఉ.I.40) మొదలైనవి. ఈ ప్రయోగాలన్నిటిలోను వినపడేది హ్రస్వ అకారం.

ఇక తాటాకువంటి పదాలలో వినబడే దీర్ఘ అకారానికి సంబంధించిన ప్రయోగాలుకూడ ఈ కావ్యాలలో చాలా లభిస్తున్నవి. ఉదా : మెంతి + ఆకు = మెంతాకు (అ.నా.హం. IV. 133), చెవులుపట్టి + ఆడించు = చెవులు పట్టాడించు (చే. వెం. వి.II. 106), ఎటి+ ఆవల = ఏటావల (చే. వెం. సా.), ఊడి + ఆడ = ఊడాడ (కూ. తి. న IV. 47), మోవి + ఆనవలదె = మోవానవలదే (ప. రం. ఉ. I 56), కిళ్ళి + ఆకు = కిళ్ళాకు (స. వెం. రా. I.67), చనుదెంచి + అనాదమాలించి = చనుదెంచానాదమాలించి (కా. అ. ఆ. పీఠిక. 5), కలికి+